బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారంలో సరయు ఎలిమినేట్ కాగా.. రెండో వారం ఎలిమినేషన్ కి సంబంధించిన ప్రక్రియ సోమవారం ఎపిసోడ్ లో జరిగింది. ఈసారి మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉమాదేవి, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, యానీ, ప్రియాలు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఇక మంగళవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పటికే ఒకటి బయటకి రాగా.. తాజాగా మరో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో హౌస్ మేట్స్ అంతా కెప్టెన్సీ టాస్క్ కోసం పోరాడుతున్నట్లు కనిపించారు. 

Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌కు సైఫ్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కాదు, బిగ్ స్క్రీన్‌పైనే ‘ఆదిపురుష్’ అంటూ హింటిచ్చిన రావణుడు!

నిన్న బిగ్ బాస్ మొత్తం హౌస్ మేట్స్ ని Team Wolf, Team Eagle కింద రెండు టీమ్స్ గా విడుదల చేశారు. ఈ రెండు టీమ్స్ మధ్య కెప్టెన్సీ టాస్క్ ను నిర్వహించారు. ఈ టాస్క్ కి 'పంతం నీదా..? నాదా..?' అనే పేరు పెట్టారు. ఇదొక ఫిజికల్ టాస్క్ కావడంతో హౌస్ మేట్స్ అందరూ ఒకరిపై ఒకరు పడుతూ గేమ్ ఆడుతున్నారు. ఇంతలో శ్రీరామచంద్ర 'విమెన్ కార్డ్ వద్దు కాజల్' అంటూ ఆమెకి వార్నింగ్ ఇస్తున్నాడు. 

ఆ తరువాత సన్నీ-సిరిల మధ్య కూడా గొడవ జరిగినట్లుగా ఉంది. రవి-విశ్వలు కూడా అరుచుకుంటూ మాట్లాడుతున్నారు. ప్రోమో చివర్లో సన్నీ గుక్క పెట్టి ఏడ్చినట్లుగా చూపించారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఎవరు కెప్టెన్ గా గెలుస్తారో చూడాలి!

Also Read : ఉమాదేవి బూతులు.. ఫేక్ జనాలపై ఫైర్ అయిన శ్వేతా.. ఈ వారం నామినేషన్‌లో ఉన్నది వారే..

Also Read: విశ్వ ఏమిటా ఏడుపు? ‘బిగ్ బాస్’ సీజన్ 5లో ‘పాతాళగంగ’ అవార్డుకు అబ్బాయిలు పోటీ?

Also read: నటరాజ్ చెప్పిన ఆ గుంట నక్క రవియేనా..?