తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 మొదలై వారం రోజులు అయింది. మొదటివారంలో కంటెస్టెంట్ సరయు ఎలిమినేట్ అయింది. ఇక సోమవారం నాడు నామినేషన్ కి సంబంధించిన ప్రక్రియను చేపట్టాడు బిగ్ బాస్. Team Wolf Vs Team Eagle అనే టాస్క్ తో నామినేషన్ షురూ చేయగా.. మొత్తం ఏడుగురు ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఇక ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో నిన్న నామినేషన్ ప్రాసెస్ లో చోటుచేసుకున్న డిఫరెన్సెస్ ను సార్ట్ అవుట్ చేసుకొనే ప్రయత్నం చేశారు కొందరు హౌస్ మేట్స్. 


Also Read : ఉమాదేవి బూతులు.. ఫేక్ జనాలపై ఫైర్ అయిన శ్వేతా.. ఈ వారం నామినేషన్‌లో ఉన్నది వారే..


ముందుగా శ్వేతావర్మ.. ప్రియాంకతో డిస్కషన్ పెట్టింది. లోబో తనను నామినేట్ చేస్తూ గేమ్ ఆడడం లేదనే రీజన్ ఇచ్చాడని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ప్రియాంక ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇక యాంకర్ రవి.. నటరాజ్ మాస్టర్ తో కూర్చొని మాట్లాడదామంటే ఆయన అసలు సహకరించడం లేదని సిరితో చెబుతున్నాడు. నటరాజ్ మాస్టర్ నిన్న చెప్పిన గుంట నక్క స్టోరీను తనను ఉద్దేశించే చెప్పాడని రవి భావించి అదే విషయాన్ని నటరాజ్ మాస్టర్ దగ్గర ప్రస్తావించగా.. 'మీ దగ్గర గట్టి ప్రూఫ్ ఉంది కదా.. నేనే ఎక్కిస్తున్నా అందరికీ మీ మీదా అని' అనగా.. 'నువ్వెందుకు అనుకుంటున్నావు' అంటూ కౌంటర్ ఇచ్చారు. 


అందరూ సేఫ్ గేమ్స్ ఆడుతున్నారని ప్రియా.. తను జైలుకి వెళ్లినప్పుడు చాలా మంది తనను ఎక్కి తొక్కేశారని జెస్సీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక లోబో తనను నామినేట్ చేయడం గురించి డిస్కషన్ పెట్టిన రవి.. 'మంచి దారిలో తీసుకెళ్దాం.. ఫ్రెండ్షిప్ కి ఒకఉదాహరణ క్రియేట్ చేద్దామని నేను చేస్తుంటే.. వాళ్లని, వీళ్లని చేయలేనని నన్ను నామినేట్ చేస్తున్నాడు' అంటూ లోబోపై మండిపడ్డాడు. 


అనంతరం బాత్రూమ్ లో ఉన్న ఉమాదేవితో మాట్లాడే ప్రయత్నం చేశాడు సన్నీ. 'కోపం ఉండాలి.. ప్రేమ ఉండాలి' అని ఆమెకి చెప్పగా.. 'ప్రేమ తీసుకోవట్లేదు కదా.. కోపమే తీసుకుంటున్నారు' అని ఉమాదేవి అరుస్తూ చెప్పింది. 'ఒకసారి ప్రేమగా మాట్లాడండి' అని సన్నీ చెప్పగా.. 'నేను ఎవరితోనైనా ఇలానే మాట్లాడతానని.. ఇంట్లో నా మొగుడితో కూడా ఇలానే మాట్లాడతా' అని చెప్పింది. దానికి సన్నీ.. ఇక్కడ రకరకాల మైండ్ సెట్స్ తో ఉన్నవాళ్లు ఉన్నారని సన్నీ చెబుతుండగా.. నా మైండ్ సెట్ నాది నచ్చితే యాక్సెప్ట్ చేయండి లేకపోతే లేదంటూ మండిపడింది.