ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అంటే గంటల పాటు వెయిటింగ్, ఎప్పుడు ఏ డాక్టర్ ఉంటారో తెలియదు. అరకొర సదుపాయాలు, శిథిలావస్థ భవనాలు... ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజావైద్యంపై దృష్టి పెట్టాయి. సూపర్ స్పెషాలిటీ సదుపాయాలతో ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.  


Also Read: హుజురాబాద్‌లో హరీష్ గ్యాస్ బండ గుర్తుకు ప్రచారం చేస్తున్నారా..? ట్రబుల్ షూటర్‌కు కొత్త సమస్య !


ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ఆదర్శంగా 


కొందరు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వనరులను వినియోగిస్తూ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తన పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవడంతో అక్కడి సదుపాయాలు కూడా  మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో సామాన్యులు కూడా ప్రభుత్వ వనరులను వినియోగించుకునేందుకు ముందుకు వచ్చేందుకు ప్రేరణ కలుగుతోంది. అయితే తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ అధికారి చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి జాయిన్ అయ్యి ఆడపిల్లకు జన్మనిచ్చారు.  


Also Read: హుజూరాబాద్ లో జోరుగా ప్రచారం... సానుభూతి వర్సెస్ అభివృద్ధి.. గెలుపుకోసం ఎత్తుకుపై ఎత్తులు...!  


సామాన్య మహిళగా ఆసుపత్రిలో వైద్యం
 
అయితే ఈ వైద్యాన్ని ఆమె సామాన్యురాలిలా చేయించుకున్నారు. శుక్రవారం పురిటి నొప్పులతో సామాన్య మహిళగా ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకున్నారు. అనంతరం వైద్యులు ఆపరేషన్ చేసి, డెలివరీ చేశారు. సర్కారు దవాఖానాలో డెలివరీ చేయించుకుని, అందరికీ ఆదర్శంగా నిలిచారని నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. దీని వల్ల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందని చెబుతున్నారు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో ఖమ్మం అదనపు కలెక్టర్ స్నేహలతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని అంటున్నారు. ఆమె తీసుకున్న నిర్ణయంతో సామాన్యులకు ప్రభుత్వాసుపత్రులపై మరింత నమ్మకం పెరుగుతుందని పేర్కొంటున్నారు.


Also Read: రేవంత్ రెడ్డిని కలిశాను... తప్పేంటి ? కేటీఆర్‌కు ఈటల కౌంటర్ !


Also Read: కేటీఆర్‌వి గాలి మాటలు.. ఈటెల కోసం కాంగ్రెస్ పనిచేయడమా..? సీఎల్పీ నేత భట్టి విక్రమార్క


Also Read: ఆ సాక్ష్యాలు బయట పెడతా.. ఎన్నికల కమిషన్ చేసిన పని కరక్టేనా.. ప్లీనరీ ఏర్పాట్లలో కేటీఆర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి