తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం ఢిల్లీకి వెళ్తున్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై స్పష్టత కోసం కేంద్రానికి లేఖ రాసినా స్పష్టత రానందున ఢిల్లీలోనే తేల్చుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. సీఎస్‌తో కలిసి ఢిల్లీ వెళ్లి అధికారుల్ని , కేంద్రమంత్రుల్ని అవసరం అయితే ప్రధానమంత్రినీ కలవాలని నిర్ణయించుకున్నామన్నారు. బాయిల్డ్ రైస్ కొనేది లేదని చేసిన ప్రకటనపై కేసీఆర్ సందేహం వ్యక్తం చేశారు. అది ఎంతవరకు నిజమో తెలియదని .. ఢిల్లీ పర్యటనలో క్లారిటీ తీసుకుంటామన్నారు.
రైతు ఉద్యమంలో అమరులైన వారికి రూ. 22.5 కోట్ల పరిహారం !
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమంలో అమరులైన వారిలో ఒక్కో కుటుంబానికి రూ. మూడు లక్షల పరిహారాన్ని కేసీఆర్ ప్రకటించారు. 700 నుంచి 750మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని.. అందరికీ పరిహారం ఇచ్చేందుకు ₹22.5కోట్లు ఖర్చవుతుందన్నారు. అమరులైన రైతుల వివరాల కోసం రైతు సంఘటన్ నేతల్ని సంప్రదించి అమరులైన రైతుల కుటుంబాలను మంత్రులు, అవసరమైతే తాను వెళ్లి స్వయంగా కలిసి ఎక్స్‌గ్రేషియో అందిస్తామని ప్రకటించారు. అలాగే కేంద్రం కూడా ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులపై వేలాది కేసులన్నీ ఎత్తివేయాలని రైతులకు మద్దతు తెలిపిన వారిపై దేశం ద్రోహం కేసులు కూడా పెట్టారన్నారు. అమాయకులపై పెట్టిన కేసులను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Also Read : ‘మోదీ రాక్షసుడు.. ఆ చట్టాలు అప్పుడే రద్దు చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది’: రేవంత్ రెడ్డి
వానాకాలం పంట చివరి గింజ వరకూ కొనుగోలు !
వానాకాలం పంటలో చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కేసీఆర్ భరోసాఇచ్చారు. ఇప్పటికే 6600 కేంద్రాలు ప్రారంభించాం. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. బీజేపీ నేతలు చేసే చేసే చిల్లర ప్రచారాన్ని రైతులు నమ్మొద్దన్ని.. యాసంగికి రైతుబంధు కూడా సకాలంలో ఇస్తామన్నారు.
Also Read: ఈటెల రాజేందర్‌ది ధర్మ పోరాటం అంటున్న పూనమ్ కౌర్... ఆయన్ను కలిసి!
నీటి వాటాల అంశం తేల్చాలి!
ఢిల్లీ పర్యటనలో నీటి వాటాల అంశాన్ని తేల్చుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లయినా తెలంగాణ నీటి వాటా ఎంతో తేల్చలేదన్నారు. ఈ విషయంలో కేంద్రం చేస్తున్న ఆలస్యం తెలంగాణ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిందన్నారు. కృష్ణా, గోదావరిలో నీటి వాటాలను తేల్చేందుకు వెంటనే ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి నిర్దేశిత సమయంలో తేల్చాలి. కోర్టులో కేసు కూడా ఉపసంహరించుకున్నాం. లేనిపక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నీటి వాటా తేల్చాల్చిన బాధ్యత కేంద్రానిది. కానీ, ఆ బాధ్యతను విస్మరించిందన్నారు. సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు.
Also Read : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ మధుసూదనా చారి .. వెంటనే రాజ్ భవన్ ఆమోదం !
వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేయడం సరి కాదు !
తెలంగాణలో వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని విద్యుత్ చట్టం తెచ్చి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. దీనిపై రైతులు చాలా ఆందోళనతో ఉన్నారని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీ నిర్ణయాన్ని అమలు చేసుకోవాలని సలహా ఇచ్చారు. కానీ, అన్ని రాష్ట్రాల్లో మీటర్లు పెట్టాలని ఆదేశించడం సమంజసం కాదన్నారు. పార్లమెంట్‌లో విద్యుత్ చట్టం బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలన్నారు. రాబోయే జనగణనలో కులగణన చేపట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
Also Read : అధికారం కంటే ప్రజల శక్తి ఎప్పుడూ గొప్పదే.. సాగు చట్టాల రద్దుపై కేటీఆర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి