కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేయడం పట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆ వెంటనే ఆయన ట్వీట్ చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజల శక్తి ఎప్పుడూ అధికారంలో ఉన్నవారి పవర్ కంటే అధికమని కేటీఆర్ ట్వీట్ చేశారు. తమ డిమాండ్‌ల కోసం నిరంతం శ్రమించి భారత రైతులు తమకు కావాల్సినదాన్ని విజయవంతంగా సాధించారని అన్నారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని కూడా జోడించారు.


‘‘ప్రజల పవర్ ఎల్లప్పుడూ అధికారంలో ఉన్నవారి శక్తి కంటే గొప్పది. తమ డిమాండ్‌ల కోసం నిరంతం శ్రమించి భారత రైతులు తమకు కావాల్సినదాన్ని విజయవంతంగా సాధించారు. జై జవాన్ జై కిసాన్’’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.






3 కొత్త చట్టాలు రద్దు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో సాగు చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని పేర్కొన్నారు మోదీ. దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులు ఇక ఆందోళన విరమించి ఇళ్లకు వెళ్లాలని కోరారు. తాము తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని, కానీ.. ఒక వర్గం రైతులను ఒప్పించలేకపోయినట్లు తెలిపారు మోదీ.


‘‘రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వ్యవసాయ బడ్జెట్‌ను ఐదింతలు పెంచాం. ఇవి రైతులకు ప్రయోజనం చేకూర్చే చట్టాలే.. కానీ ఓ వర్గం రైతులను మేం ఒప్పించలేకపోయాం. దిల్లీ సరిహద్దులో నిరసన చేస్తోన్న రైతులు ఇక ఇళ్లకు వెళ్లాలని కోరుతున్నాను.’’ అని ప్రధాని మోదీ మాట్లాడారు.


విజయం సాధించిన రైతులు
సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఏడాది నుంచి దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్నారు. కేంద్రం, రైతు సంఘాల మధ్య పలు దఫాలు చర్చలు జరిగినా ఫలించలేదు. అయితే.. ఇన్ని రోజుల తర్వాత నేడు వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గింది కేంద్రం. దాదాపు 8 నెలలుగా రైతుల ఉద్యమం సాగింది. నూతనంగా తెచ్చిన సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూరేలా ఈ చట్టాలు ఉన్నాయని అన్నదాతలు ఆవేదన చెందారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులకు- అన్నాదాతలకు మధ్య చాలా సార్లు చర్చ జరిగింది.


Also Read: Breaking News LIVE: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. నూతన సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన


Also Read: నిరంతరం అందుబాటులో ఉంటా.. ఏం కావాలన్నా అడగండి.. సీఎం జగన్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి