తెలంగాణ సీఎం కేసీఆర్ ( KCR ) యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించి ప్రజల మన్ననలు అందుకున్నారు. ఇప్పుడు  దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ ఆలయాన్ని ( Vemulavada Temple ) అభివృద్ది చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. యాదాద్రి ( Yadadri ) తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వేములవాడ అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనల కోసం  కేసీఆర్‌ శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి (  Srungeri Peetam ) వద్దకు వెళ్లనున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. శృంగేరి పీఠాధిపతుల మార్గదర్శనం, ఆగమ నిర్దేశం మేరకు వేములవాడ పునర్నిర్మాణ ప్రక్రియ జరపాలని కేసీఆర్ భావిస్తున్నారు. 


ఇతర రాష్ట్రాల్లో తినని బియ్యం ఏం చేసుకుంటాం - తెలంగాణ సర్కార్ ధమ్కీలు ఇస్తోందని పీయూష్ గోయల్ విమర్శలు


ఆగమ సంబంధమైన సమస్యలు, ఆలయ సంబంధమైన ఇబ్బందులు లేకుండా పునర్నిర్మాణ బాధ్యత మొత్తాన్నీ శృంగేరీ జగద్గురువులకే ( Jagadguru ) అప్పగిస్తారనీ ప్రచారం జరుగుతోంది. పండితులు, శిల్పులంతా వారు సూచించిన మేరకే ఉంటారని అంటున్నారు. కేసీఆర్ ( CM KCR ) ఇప్పటి వరకు వైష్ణవ గురువు అయిన చినజీయర్ సహాలు ఎక్కువగా తీసుకున్నారు. అందుకే ఈ సారి శైవం వైపు దృష్టి సారించారని భావిస్తున్నారు.  వైష్ణవంతో పాటు శైవాన్ని ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగించాలన్నది కేసీఆర్‌ ఉద్దేశంగా కనిపిస్తోందని టీఆర్ఎస్ ( TRS ) వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


హుజూరాబాద్‌‌లో గెల్లు Vs కౌశిక్! హాట్ టాపిక్‌గా TRS నేతల తీరు, ఫోకస్ చేసిన అధిష్ఠానం


నిజానికి వేములవాడ అభివృద్ధికి ఇప్పటికే కేసీఆర్ చాలాప్రకటనలుచేసారు. వేములవాడ ఆలయ అభివృద్దికి ఏటా రూ.వంద కోట్లు ( Rs. 100 Crores ) చొప్పున నాలుగేండ్లళ్లలో రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని 2015లోనే హామీ ఇచ్చారు.  రూ. 400 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన 13 అంశాలతో కూడిన పనుల ప్రతిపాదనలను రూపొందించారు. కానీ ఎక్కడా మందుకు సాగలేదు. ఇప్పుడు యాదాద్రి బాధ్యతలు పూర్తి కావడంతో ఇక వేములవాడపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.   


ఉగాది నాడు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతా ఫ్రీ ఆఫర్, వీళ్లకి మాత్రమే - సజ్జనార్ ట్వీట్


ప్రస్తుతం వేములవాడ ఆలయం అభివృద్ధికి సంబంధించి కేసీఆర్ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో భారతి స్వామితో ( Bharati Swamy )  భేటీ అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. యాదాద్రి ఆలయాన్ని చినజీయర్ స్వామి సలహాలతో నిర్మించారు. వేములవాడను  భారతీర్థ స్వామి సలహాలతో నిర్మించబోతున్నారు.