కరోనా కొత్త వేరియంట్ విషయంలో తేలికగా ఉండకూడదని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ "ఒమిక్రాన్"ను సమర్థవంతంగా ఎదుర్కునే విషయలో తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. హరీశ్‌రావు చైర్మన్‌గా కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉంటారు. మంత్రివర్గ సమావేశంలో ప్రజారోగ్యం, వైద్యసేవలుపైనే ప్రధానంగా చర్చించారు. కోవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సీజన్ బెడ్స్ సామర్థ్యం, తదితర అంశాలపై కేబినెట్ సమీక్షించింది.
కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉన్నదని, అన్ని రకాల మందులు, పరికరాలు, మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని అధికారులు కేబినెట్‌కు తెలిపారు. ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేబినెట్ ఆర్యోగశాఖను ఆదేశించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, అందుకు మంత్రులందరూ వారి వారి జిల్లాల్లో సమీక్షించాలని, అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
కరోనా పరీక్షలు పెంచేందుకు చేసేందుకు అవసరమైన ఏర్పాట్ల సన్నద్ధతపై కేబినెట్‌లో చర్చించారు. జిల్లాల వారీగా టీకా ప్రక్రియను సమీక్షించి, అదిలాబాద్, కుమ్రుంభీం, నిర్మల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది. తెలంగాణ మమంత్రివర్గ సమావేశంలో కేంద్రం వైఖరిపైనా చర్చ జరిగింది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. కేంద్రం తప్పించుకుంటోందని ఓ అభిప్రాయానికి వచ్చారు.
మంత్రివర్గ సమావేశం మొత్తం ప్రధానంగా ఒమిక్రాన్ జాగ్రత్తలు,ధాన్యం కొనుగోలు అంశంపైనే చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. జాబ్ నోటిఫికేషన్లు.. ఇతర అంశాలపై పెద్దగా చర్చ జరగలేదు. అయితే కొన్ని కీలక నిర్ణయాలకు మాత్రం కేబిెనెట్ ఆమోద ముద్ర వేసింది. ఆ నిర్ణయాలు ఏమిటో అధికారికంగా స్పష్టత లేదు. కేబినెట్‌కు కూడా ఎక్కువగా దాన్యం సేకరణ సమస్యను ఎలా ఎదుర్కోవాలో అన్న సమస్యే పెద్దదిగా కనిపించింది.
Also Read: సమ్మెకు సిద్ధమైన స్విగ్గి డెలివరీ బాయ్స్.. స్పందించకుంటే డెలివరీలన్నీ బంద్, కారణం ఏంటంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి