కృష్ణా ట్రైబ్యునల్‌ అంశంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కృష్ణా ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు, గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలపై పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై డిసెంబర్‌ 13 నుంచి జస్టిస్ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ మేరకు వాదనల వివరాలు సమర్పించాలని ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రను త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్రాలు 3 పేజీలకు మించకుండా వాదనల వివరాలు పంపాలని స్పష్టం చేసింది. విచారణకు 48 గంటల్లోపు కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


Also Read : పంచాయతీ ఖాతాలను ప్రభుత్వం ఎందుకు ఖాళీ చేసింది ? సొంత క్యాడర్‌ను వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ఎందుకు ఇబ్బంది పెడుతోంది ?


కృష్ణా జలాల పంపిణీలో జరిగిన అన్యాయంపై అంతర్‌రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లో సెక్షన్‌ 3 ప్రకారం విచారించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసింది. కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89 ప్రకారం విచారణ జరిపేందుకు బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ నిర్ణయించింది. దానిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతర్‌రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లో సెక్షన్‌ 3 ప్రకారం జలాల పంపిణీ చేపట్టేలా ట్రిబ్యునల్‌ను ఆదేశించాలని కేంద్రాన్ని కోరింది. అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 


Also Read : విపత్తు నిర్వహణలో బాగా పని చేశారు.. సీఎం జగన్‌కు కేంద్ర బృందం అభినందన !


విచారణలో  సుప్రీంకోర్టు కేంద్రం అభిప్రాయాన్ని కోరగా, పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే ట్రిబ్యునల్‌కు సిఫారసు చేస్తామని అఫిడవిట్‌ దాఖలు చేసింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఉపసంహరణ పిటిషన్ దాఖలు చేసింది.   తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.  అయితే ఈ పిటిషన్ ఉపసంహరణపై ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రస్తుతం ఆదేశాలు ఇవ్వట్లేదని సుప్రీంకోర్టు తెలిపింది.


Also Read : డ్వాక్రా మహిళల డబ్బునూ ఏపీ ప్రభుత్వం వాడుకుందా ? అభయహస్తం పథకంపై వివాదం ఏమిటి ?


అభ్యంతరాల దాఖలుకు ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు అవకాశం కోరాయి. దీంతో అభ్యంతరాలు దాఖలుకు ఆ రెండు రాష్ట్రాలకు కోర్టు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో ఇటీవల తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఏర్పడినప్పుడు ఏపీ ప్రభఉత్వం రెండు రాష్ట్రాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందాలు,  ట్రిబ్యునల్స్ ఆదేశాలను కచ్చితంగా అమలయ్యేలా చూడాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఏపీ ఆ పిటిషన్ లో  ఆరోపించింది. తమ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటాను కూడ తెలంగాణ సర్కార్ గండికొడుతుందని ఏపీ  ప్రభుత్వం  ఆ పిటిషన్ లో తెలిపింది. వీటన్నింటిపైనా సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. 


Also Read : అవినాష్ రెడ్డిని ఇరికించడానికి సీబీఐ కుట్ర.. రూ. 10 కోట్లు ఆఫర్ చేశారని అనంతపురం ఎస్పీకి వ్యక్తి ఫిర్యాదు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి