తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో ఇటీవల వర్షాలకు కూరగాయల పంటలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో కూరగాయల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ముందు ఉల్లి ఘాటెక్కితే... తాజాగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. గత రెండు రోజులుగా టమాటా ధరలు కాస్త తగ్గినా... వచ్చే రెండు నెలల్లో టమాటా ధరలు మళ్లీ పెరుగుతాయని క్రిసిల్(CRISIL) తాజా నివేదికలో తెలిపింది. 


'దేశంలో అక్టోబర్-డిసెంబర్ నెలల్లో టమాటా పంటను ఎగుమతి చేసే ప్రధాన రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలో ఇటీవల వరదలకు టమాటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో సప్లైపై తీవ్ర ప్రభావం పడనుంది. కర్ణాటక, మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉందని  క్షేత్రస్థాయి పరిశీలనలో తెలిసింది' అని క్రిసిల్ నివేదికలో పేర్కొంది.  'గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే టమాటా ధరలు142 శాతం అధికంగా పెరిగాయి. వచ్చే 45-50 రోజుల్లో ధరల పెరుగుదల కనిపిస్తుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంటే టమాటాలు మార్కెట్లోకి వచ్చేందుకు దాదాపు రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. దీంతో ధరలు పెరుగుదల నిలకడగా ఉంటుంది.' అని క్రిసిల్ రిపోర్టులో తెలిపింది. 


Also Read: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి


ఉల్లి ధరలు తగ్గొచ్చు 


వచ్చే 10-15 రోజుల్లో ఉత్తర భారతదేశంలో పండించిన ఉల్లి మార్కెట్ కు చేరే అవకాశం ఉండడంతో... ఉల్లిపాయల ధరలు తగ్గొచ్చని క్రిసిల్ తెలిపింది. దీంతో వినియోగదారుడికి కొంత ఊరట లభించనుందని పేర్కొంది. ఉల్లి పంటను ఎక్కువగా సాగు చేసే మహారాష్ట్రలో.. ఆగస్టులో అంతగా వర్షాలు కురవకపోవడంతో పంట  దిగుబడికి ఎక్కువ సమయం పట్టిందని, దీంతో సెప్టెంబర్ కన్నా అక్టోబర్ లో ఉల్లి ధరలు 65  శాతం మేర పెరిగాయని తెలిపింది.   


Also Read: వంటలక్కలు, వంటలయ్యలూ.. టమోటా ధరలు చూస్తున్నారుగా? ఇలా ఇంట్లోనే పెంచేస్తే పోలా..


ఆలూ ధరలు పెరిగే అవకాశం 


ఇటీవల వర్షాలకు బంగాళాదుంప(ఆలూ) సాగు ఆలస్యం కావడంతో వచ్చే రెండు, మూడు నెలల్లో ఆలూ ధరలు పెరగవచ్చని క్రిసిల్ తన నివేదికలో స్పష్టం చేసింది. దేశంలో అధికంగా వినియోగించే కూరగాయాల్లో టమాటా, ఉల్లి, ఆలూ ముందున్నాయి. దేశంలో పండించే మొత్తం కూరగాయల్లో 10శాతం టమాటా సాగు ఉందని క్రిసిల్ తెలిపింది. 


Also Read: నిన్న రూ.100.. నేడు రూ.10.. ఒక్కసారిగా పడిపోయిన టమోటా ధర


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి