నిన్న, మొన్నటి వరకుకిలో టమోటా ధర రూ. 100 నుంచి రూ. 150 వరకు పలికింది. కానీ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అది ఎంతగా అంటే ఊహించలేనంతగా. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమోట ధర గరిష్టంగా రూ. 27 పలకగా, కనిష్టంగా రూ.10 పలికింది. ఒక్కసారిగా టమోట ధరలు భారీగా తగ్గడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఆస్పరి మార్కెట్లో రూ.150 కిలో పలికి 24 గంటలు గడువక ముందే రూ.27కి పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ప్రస్తుతం వస్తున్న ధరలతో కనీసం పంట రవాణా ఖర్చులు కూడ సరిపోవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమోటా ధరలు ఒక్కసారిగా ఇంతగా పతనం కావడానికి గల కారణాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో టమోట ధరలను దృష్టిలో పెట్టుకొని ఇతర రాష్ట్రాల నుంచి టమోటాను దిగుమతి చేసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణతో పాటు మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర నుంచి దిగుమతి కావడం వల్ల ధరలు తగ్గాయని పత్తికొండ వ్యాపారులు చెబుతున్నారు. 


అయితే కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రిటైల్ మార్కేట్లో కిలో టమోటా రూ. 80 నుంచి రూ. 50 వరకు విక్రయించడం విశేషం. కర్నూలు జిల్లాలో ఇతర పలు ప్రాంతాలలో కిలో టమోటా రూ.50 నుంచి వంద పలుకుతుండగా, పత్తికొండ మార్కేట్లో మాత్రం ఊహించని విధంగా ఒక్కసారిగా ధరలు తగ్గడంపై వ్యాపారుల సిండికేట్ అయ్యారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


వ్యాపారులు పత్తికొండలో ధరలు తగ్గించి, ఇతర ప్రాంతాల్లో అధిక రేట్లకు అమ్ముకునేందుకు పన్నాగం పన్నినట్లు రైతులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ వీటికి సంబంధించి నిజానిజాలు తెలియాల్సి ఉంది. అయితే ఇదే సమయంలో టమోటా విక్రయాలకు నెంబర్ వన్ గా ఉన్న చిత్తూరు జిల్లాల్లో కూడ కిలో టమోట రూ. 20 పలికింది. 30 కిలోల టమోట బాక్స్ కేవలం రూ. 600లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇదే రెండురోజుల క్రితం 30 కిలోలటమోట బాక్సు ఏకంగా రూ. 3వేల వరకు ధర పలికింది. 


అయితే ఇతర రాష్ట్రాల నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లె ములకల చెరువు మార్కేట్లో టమోటాలు తీసుకరావడంతో ధరలు భారీగా తగ్గాయన్నది రైతుల భావన. ఇక టమోటా విక్రయాలకు ప్రఖ్యాతి చెందిన మదనపల్లిలో సైతం టమోట కిలో రూ.50కు పలికింది.


Also Read: Tomato: వంటలక్కలు, వంటలయ్యలూ.. టమోటా ధరలు చూస్తున్నారుగా? ఇలా ఇంట్లోనే పెంచేస్తే పోలా..


Also Read: Tomato Alternatives: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి