దేశంలో ఆహార ధాన్యాలు సేకరిచండం, సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆహార భద్రత కోసం బఫర్‌ స్టాక్‌ నిల్వ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల వ్యతిరేక విధానాలు అమలుచేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వల్ల అనేక రంగాల్లో ఇబ్బందులు సృష్టిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సిపాయిలా పోరాడాలి కానీ చేతకాని దద్దమ్మాలా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారన్నారు. బీజేపీ రైతు రాబందు పార్టీ అని విమర్శించారు. 


Also Read:చక్రాలపై మన భవిష్యత్ భద్రంగా ఉంది.. బస్సులో హోం వర్క్ చేస్తున్న విద్యార్థి వీడియో ట్వీట్ చేసిన సజ్జనార్



గత యాసంగి డబ్బులు ఇంకా ఇవ్వలేదు


మంత్రి వర్గ భేటీలో ధాన్యం సేకరణపై చర్చించామని సీఎం కేసీఆర్ అన్నారు. గత యాసంగిలో సేకరించిన ధాన్యానికి కేంద్రం డబ్బులు ఇంకా ఇవ్వలేదన్నారు. మెడ మీద కత్తిపెట్టి బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని  లేఖ రాయించుకున్నారని ఆరోపించారు. వానాకాలంలో 60 లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకోవాలని కేంద్రాన్ని కోరామని, కానీ అందుకు కేంద్రం నిరాకరించిందన్నారు. తెలంగాణలో వాతావరణ పరిస్థితుల మేరకు యాసంగిలో బాయిల్డ్‌ రైస్ కు అనుకూలంగా ఉంటుందన్నారు. బాయిల్డ్‌ రైస్‌కు గతంలో ఎఫ్‌సీఐ ప్రోత్సహించిందని, ఇప్పుడు కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఎంత కొంటామే స్పష్టంగా చెబితే అంతవరకే పండించి ఇస్తామన్నారు. కేంద్రం సహకరించనప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించామన్నారు. ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా కేసులు వేసినా ప్రాజెక్టులు నిర్మించామని కేసీఆర్ అన్నారు. దీంతో తెలంగాణలో పంటలు దిగుబడి పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ చేశారన్నారు. 



Also Read:  థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రెడీ.. పడకలు సిద్ధం, ఒమిక్రాన్ ఆందోళన వేళ మంత్రి హరీశ్ సమీక్ష


కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి


ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత విస్మరిస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ధాన్యం సేకరణలో రాద్ధాంతం చేసి రైతులందరికీ గందరగోళానికి గురి చేస్తోందని విమర్శించారు. కేంద్రం కిరాణా షాపు యాజమానిలా మాట్లాడుతుందన్నారు. ఏ ప్రభుత్వానికైనా ప్రజా పంపిణీపై సామాజిక బాధ్యత ఉండాలన్నారు. బీజేపీ వాట్సాప్ యూనివర్శిటీలో పచ్చి అబద్ధాలు ఆడుతుందని విమర్శించారు. తెలంగాణ రైతుల కోసం పేగులు తెగే దాకా కొట్లాడుతానన్నారు. యాసంగిలో వరి సేకరణ ఉందన్నారు. కొనుగోలు కేంద్రాలే ఉండమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వర్షకాలం పంటను సేకరిస్తామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేసీఆర్ సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు రావాలన్నారు. కేంద్ర మంత్రి రాష్ట్రానికి చేసిందేం లేదన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే కిషన్ రెడ్డి ఇల్లు, దిల్లీలో బీజేపీ ఆఫీస్ ముందు పారబోస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. 


Also Read: పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీల నిరసన... వరి ధాన్యాన్ని పూర్తిగా సేకరించాలని ప్లకార్డుల ప్రదర్శన


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి