కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి, నిజాబామాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి నుండి  ధృవీకరణ పత్రం అందుకున్నారు.  నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మరోసారి ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు కవి.  అన్ని పార్టీల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు గమనించి పోటీ లేకుండా టీఆర్ఎస్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలలో సహకరించిన ఉమ్మడి నిజామాబాద్ ‌జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


Also Read : రబీ సంగతి తరువాత.. ముందు ఖరీఫ్ పంటలపై తేల్చండి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి


మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 90 శాతం ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని.. కవిత గెలుపుకు కృషి చేసినవారికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య పాత్ర పోషిస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పధ్నాలుగు నెలల క్రితం ఎమ్మెల్సీగా నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి కవిత ఎన్నికయ్యారు. అయితే అప్పట్లో ఏకకగ్రీవం కాలేదు. పోటీ జరిగింది. అయితే ఇతర పార్టీల ఓటర్లతో సహా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడంతో భారీ మెజారిటీతో గెలిచారు. 


Also Read : ఏపీ వరి ధాన్యం లారీలకు తెలంగాణలో నో ఎంట్రీ .. సరిహద్దుల్లో నిలిచిన లారీలు !


వచ్చే జనవరితో పదవి కాలం ముగుస్తుంది. గతంలో నిజామాబాద్ స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనపై అనర్హతా వేటు వేశారు. ఆ స్థానంలో కవిత పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో ఆ స్థానంలో కవితకు చాన్సిస్తారని అనుకున్నారు. కానీ రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలని కవిత నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.


Also Read: Tomato Farmers : ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు ! 


నిజామాబాద్ ఎంపీగా ఓ సారి గెలిచిన కవిత.. గత ఎన్నికల్లో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ లోక్ సభ స్థానం నుంచే పోటీ చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే మళ్లీ నిజామాబాద్ నుంచే ఎమ్మెల్సీ అయ్యారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. 


Also Read : 10 లక్షల ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో తెచ్చాం.. గ్రామస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి