World Hypertension Day : హైదరాబాద్: రక్తపోటు, షుగర్‌ (Diabetes)ని ముందుగా గుర్తించి జాగ్రత తీసుకోకపోతే వ్యాధి ప్రాణాంతకంగా మారుతుందని, మారుతున్న లైఫ్ స్టైల్స్ వలన ఈ సమస్యలు తలెత్తుతున్నాయని తెలంగాణ ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నేడు వరల్డ్ హైపర్ టెన్షన్ డే (World Hypertension Day 2022)ను పురస్కరించుకొని, కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) సహకారంతో, Gleneagles Global Hospitals దాదాపు 9 వేల మందిపై చేసిన సర్వే ఫలితాలను తాజ్ డెక్కన్‌లో మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. 


ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు (Telangana Health Minister Harish Rao) మాట్లాడుతూ... పిల్లలకు వెల్త్ కాదు, హెల్త్ ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. బీపీ, షుగర్ ను సాధ్యమైనంత గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాధి పట్ల అవగాహన కల్పించడం కోసం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా హైపర్ టెన్షన్ డే (World Hypertension Day)ని నిర్వహించుకుంటున్నాం. కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) ఇచ్చిన సర్వే ఫలితాలు కొంత ఆశ్చర్యాన్ని, కొంత బాధను కల్గిస్తున్నాయ్ అన్నారు. నిమ్స్ లో చేసిన సర్వే ప్రకారం, కిడ్నీ సమస్యలు ఉన్నారో వారిలో 60 శాతం మందికి హైపర్ టెన్షన్ సమస్య ఉందని తెలిపారు.  


‘గతంలో శారీరక శ్రమ చేసేవారని, ఇప్పుడు ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా స్మార్ట్‌ఫోన్లతో సమయాన్ని గడపుతున్నారు. తీవ్రమైన ఒత్తిడి గురవుతున్నారు. ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యని గుర్తించి ఎన్ సి డి స్క్రీనింగ్ చేస్తున్నాం. ఇండియాలో ఎన్ సి డి స్క్రీనింగ్ లో తెలంగాణ 3 స్థానంలో ఉంది. 90 లక్షలు మందికి స్క్రీనింగ్ చేస్తే, స్క్రీనింగ్ లో 13 లక్షలు మందికి హైపర్ టెన్షన్ (Hypertension) ఉంది. వచ్చే 2 ,3 నెలలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్ టెస్టులు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 33 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తుందని’ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 


చిన్న పిల్లలకు కూడా కిడ్నీ సమస్యలు
రానున్న 3,4 నెలలు మొత్తంగా టెస్టులు పూర్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలోకి తీసుకు వస్తామన్నారు. ఆయుష్ ద్వారా 450 వెల్ నెస్ సెంటర్లు ద్వారా మంచి ఆరోగ్యం పట్ల ట్రైనింగ్ ఇవ్వనున్నాం. పోస్ట్ కోవిడ్ ద్వారా హైపర్ టెన్షన్ కొంత పెరిగినట్టు కనిపిస్తుంది. చిన్న పిల్లలకు కూడా కిడ్నీ సమస్యలు వస్తున్నాయని, ప్రత్యేకంగా హైదరాబాద్‌లో సర్వే చేస్తామన్నారు. 350 బస్తీ దవఖానాల్లో ద్వారా 57 టెస్టులు చేస్తున్నాం. వచ్చే నెల నుంచి 120 పైగా టెస్ట్ లో చేయనున్నాం. రిపోర్ట్స్ ని పేషెంట్, డాక్టర్లకు మొబైల్ ద్వారా 24 గంటల్లో పంపిస్తున్నాం. 45 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా బీపీ, షుగర్ టెస్టులు చేయించుకోవాలని మంత్రి హరీష్ రావు కోరారు.  అందుకే శారీరక శ్రమను పెంచాలని, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎక్సర్‌సైజ్, యోగా, ఏదైన శారీరక శ్రమ చేస్తూ ఫిట్‌నెస్ కాపాడుకోవాలని మంత్రి హరీష్ సూచించారు. 


Also Read: World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే


Also read: గర్భంతో ఉన్నప్పుడు ఈ మందులు వాడితే ఎంత ప్రమాదమో తెలుసా? వీలైనంత వరకు వాడకపోతేనే మంచిది