Cabs, Autos, Lorries Bundh on May 19: మే నెల 19న తెలంగాణలో ఆటోలు, క్యాబ్‌లు, లారీలు బంద్ పాటించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర లారీ, ఆటో, క్యాబ్ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఈ బంద్ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు సంబంధించిన పత్రికలను సంఘాల లీడర్లు హైదరాబాద్‌లోని హైదర్ గూడలో ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయనున్నట్లు జేఏసీ లీడర్లు తెలిపారు.
ఈ నెల 19న ఆటోలు, క్యాబ్‌ల బంద్ సందర్భంగా లారీ, ఆటో, క్యాబ్ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రవాణా శాఖ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లుగా వారు తెలిపారు. కరోనా వ్యాప్తి చెందిన గడ్డు సమయంలో కార్మికులను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం జీవో 714 తీసుకొచ్చి ఫిట్‌నెస్ రెన్యూవల్ పేరుతో రోజుకు రూ.50 పెనాల్టీ వేయడంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: Nalgonda: ‘పైసలియ్యి, లేకుంటే చావు’ పెళ్లి కాకముందే కట్నం కోసం వరుడి మెసేజ్‌లు - యువతి ఆత్మహత్య
గత మార్చిలోనూ బంద్ పాటింపు
ఆటో ఛార్జీలు పెంచాలని కోరుతూ పలు ఆటో సంఘాలు మార్చి నెల 28, 29 తేదీల్లో కూడా బంద్ కు పిలుపునిచ్చాయి. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఆటో వాలాలను ఆదుకునేందుకు ఛార్టీలు పెంచాలని, కొత్తగా మరో 20 వేల పర్మిట్లు ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్, క్యాబ్ యూనియన్స్ జేఏసీ నేతలు వెంకటేశం, సత్తిరెడ్డి, మల్లేష్ గౌడ్, మారయ్య, అమానుల్లాఖాన్ తదితరులు అప్పుడు డిమాండ్ చేశారు. నగరంలో 8 ఏళ్లుగా చార్జీలు పెంచకపోవడంతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
కరోనా, లాక్ డౌన్ కారణంగా క్యాబ్ ఆటోలకు డిమాండ్ తగ్గిపోయిందని కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని వారు వాపోయారు. ఆటో చార్జీలు కనీసం రూ.40, కిలోమీటర్ కు రూ.25 చొప్పున పెంచాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ కాకుండా సీఎన్జీతో నడిచే 20 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. వృద్ధాప్య పింఛన్లు, ఆటో కొనుగోలుకు వడ్డీ లేని రుణం, వారి పిల్లల చదువులకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు.
Also Read: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్‌మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే