Two twins died in an accident in the industrial area of ​​Jeedimetla మేడ్చల్ : జీడిమెట్ల పారిశ్రామిక వాడలో విషాదం చోటుచేసుకుంది. రెనోవేషన్ చేస్తున్న పరిశ్రమలో ప్రమాదవశాత్తూ ఇద్దరు కవలలు మృతి చెందడంతో విషాదం జరిగింది. ఫ్యాబ్రికేషన్ పనులు చేసేందుకు ఇద్దరు అన్నదమ్ములైన కవలలు రాము, లక్ష్మణ్ వెళ్లారు. అయితే ప్రమాదవశత్తు తమ్ముడు కెమికల్ సంపులో పడిపోయాడు. కాపాడే ప్రయత్నంలో అన్న కూడా సంపులో పడి దుర్మరణం చెందడంతో విషాదం నెలకొంది. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.


పని దొరికిందని వెళ్తే ప్రాణాలు పోయాయి


జీడిమెట్ల పారిశ్రామిక వాడలో సాబూరి ఫార్మా కంపెనీ గత కొన్ని నెలలుగా మూసివేసి ఉంది. అయితే కంపెనీ రినోవేషన్ కు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. క్లీనింగ్ పని దొరికిందని  ఇద్దరు(కవలలు) రాము(32) , లక్ష్మణ్ (32) ఫార్మా కంపెనీలో పనికి వెళ్లారు. కెమికల్ సంపులు శుభ్రం చేస్తుండగా జరిగిన ఊహించని ఘటన ఇద్దరి ప్రాణాలు తీసింది. తమ్ముడు కెమికల్ సంపులో పడిపోగా, సోదరుడ్ని కాపాడే ప్రయత్నంలో రాము కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో సురేందర్ రెడ్డి అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురి కాగా, దగ్గరలోని రామ్ రాజ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పారిశ్రామిక వాడలో కార్మికులు, సిబ్బంది రక్షణ, భద్రతకు తీసుకుంటున్న చర్యలపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Also Read: Medak Road Accident: మెదక్ జిల్లాలో రోడ్డుప్రమాదంలో ఏడుగురి దుర్మరణం - హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి