రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రెస్‌మీట్లు పెట్టి నేతలను నిందించటం సరికాదన్నారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తాము ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల చేత ఎన్నికైన నేతలమని, నామినేటెడ్ పదవిలో ఉన్న వ్యక్తులం కాదన్నారు. సీఎంతో పని చేయడం ఇష్టం లేదని గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడం సరికాదని, ఉపరాష్ట్రపతి, గవర్నర్ అనే పాత్ర చాలా తక్కువ... గవర్నర్‌గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి అంటూ తమిళిసైకి హితవు పలికారు.


రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ గవర్నర్.. 
తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ -  టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇలా విమర్శలు, ప్రతి విమర్శలు ఎలాగైతే కొనసాగుతున్నాయో.. ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి మధ్య సైతం మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా కష్టమని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర మంత్రులు గవర్నర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి వారే ప్రోటోకాల్ విషయంలో కొన్ని నిబంధలు ఉంటాయి అన్నారని, రాష్ట్రానికి గవర్నర్ మాత్రం ఈ విషయం తెలుసుకోవడం లేదని తమిళిసైని ఉద్దేశించి మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. తాను రబ్బర్ స్టాంప్ కాదని గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలకు 


రాజ్యాంగ పరమైన హోదాలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకోవడం ఏంటని తలసాని ప్రశ్నించారు. పొద్దుగాల లేస్తే, ప్రతిపక్షాలు అధికార టీఆర్ఎస్ నేతలపై, మంత్రులపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి పనిచేయాలని, కానీ ప్రెస్‌మీట్లు పెట్టి నిందించడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. గతంలో అయితే విభేదాలు లేవని, అంతా ఓకే అని చెప్పుకుంటూ వచ్చిన టీఆర్ఎస్ నేతలు, మంత్రులు.. ఇటీవల గవర్నర్ ఢిల్లీ పర్యటన తరువాత విమర్శలకు మరింత పదును పెడుతున్నారు. తాజాగా తలసాని అయితే గవర్నర్ బాధ్యతలు గుర్తుచేసే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి.


Also Read: TS Governor VS CM: సీఎం కేసీఆర్‌తో పని చేయడం నాకు పెద్ద సవాల్, నేను రబ్బర్ స్టాంప్ కాదు- తెలంగాణ గవర్నర్‌ సీరియస్ కామెంట్స్ 


గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం  
గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మద్య గ్యాప్‌ పెరిగినట్లు వార్తలు వినిపించడంతో ఏకంగా గవర్నర్‌ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేయగా కొందరు మంత్రులు సైతం అంతే దీటుగా ప్రతి విమర్శలు చేశారు. ఈ పంచాయతీ కాస్తా డిల్లీ వరకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇవ్వాల్సిన కనీస ప్రొటోకాల్‌ను అమలు చేయడం లేదని ప్రధాని నరేంద్రమోడికి, హోం మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే డిల్లీ నుంచి వచ్చిన గవర్నర్‌ తమిళ్‌ సై రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ ప్రొటోకాల్‌ను పాటించడం లేదని మీడియా సాక్షిగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మద్య గ్యాప్‌ మరింతగా పెరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read: KTR Warangal Tour: నేడు ఓరుగల్లుకు మంత్రి కేటీఆర్, రూ. 236.63 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం