Rajasingh To ChanchalGuda : ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో రాజాసింగ్‌ను నాంపల్లి కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు మంగళ్‌హాట్ పోలీసులు తరలించారు. చంచల్‌గూడ జైలు వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చాంద్రాయణగుట్ట, మలక్‌పేట్, చార్మినార్ వెళ్లే దారులతో పాటు చంచల్‌గూడ జైలు పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.ఇక నాంపల్లి కోర్టు వద్ద రాజాసింగ్ అనుచరులు హంగామా సృష్టించారు.
నాంపల్లి కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
కోర్టు వద్ద అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అంతకు ముందు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ తమ సస్పెన్షన్‌ను తేలికగా తీసుకున్నారు. తన వల్ల పార్టీకి నష్టం జరుగుతోందంటే.. నుపూర్ శర్మలా తనను కూడా సస్పెండ్ చేయొచ్చునని అన్నారు. తనను సస్పెండ్ చేసినా ప్రధాని మోదీ, అమిత్‌షాలకు ఫాలోవర్‌గా ఉంటానన్నారు. పార్టీ కంటే.. ధర్మాన్ని కాపాడటమే తనకు ముఖ్యమన్నారు.
బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్ - వీడియో రిలీజ్ చేయడమే కారణం !
బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు
ఇటీవల హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనకు అనుమతి ఇవ్వవొద్దని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఆయన గతంలో హిందూ దేవుళ్లను అవమానిస్తూ స్టాండప్ కామెడీ చేశారని.. అందుకే ప్రదర్శనకు అంగీకరించబోమన్నారు. అయితే కేటీఆర్ ప్రత్యేక ఆహ్వానం మీద మునావర్ షో ఇవ్వడానికి వచ్చినందున పోలీసులు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని షోను సక్సెస్ చేశారు. రెండు రోజుల పాటు రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. అయితే తమ కార్యకర్తలు టిక్కెట్లు కొన్నారని.. మునావర్‌ను కొడతామని .. వేదికను తగులబెడతామని హెచ్చరించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. కానీ రాజాసింగ్ వివాదాస్పద వీడియో విడుదల చేశారు.
బిస్తర్ పట్టుకుని పాదయాత్రకు వచ్చేయండి - తెలంగాణ యువతకు బండి సంజయ్ పిలుపు !
పార్టీ నుంచి బయటకు పంపేసిన బీజేపీ
రాజాసింగ్ వీడియో పాతబస్తీలో ఉద్రిక్తతలకు కారణం అయింది. దీంతో పోలీసులు వెంటనే ఆ వీడియోను తీయించేశారు. రాజాసింగ్‌పై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన పార్టీ నుంచి కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. ధర్మం కోసం పార్టీలకు అతీతంగా పని చేస్తానని చెబుతున్నారు. రాజాసింగ్ తీరు వల్ల పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందు నుంచీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో రాజాసింగ్ దూకుడుగా ఉంటారు. చాలా సార్లు కేసులు నమోదైన ఆయన తీరు మారలేదు. మరోసారి కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయ్యారు.