Bandi Sanjay :    కేసులు, అరెస్టులకు భయపడేది లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. స్టేషన్ ఘన్‌పూర్ దగ్గర పాదయాత్ర లో ఉన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఇంటి వద్ద వదిలి పెట్టారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.  దమ్ముంటే పాదయాత్ర చేయాలని కేసీఆర్‌కు వాల్ చేశారు.  పాదయాత్ర ద్వారా ప్రజలకు 8 ఏండ్ల పాలనలో ఏం ఒరగబెట్టావో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. పాదయాత్రను అడ్డుకుని కేసీఆర్ చాలా తప్పు చేశారన్నారు.  యుద్దం మొదలైంది... పాదయాత్రకు యావత్ యువత తరలిరావాలని పిలుపునిచ్చారు.  కేసులు, అరెస్టులకు భయపడకండి...రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని భరోసా ఇచ్చారు.


టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేద్దాం !


యువత తరలి వస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేద్దామని పిలుపునిచ్చారు.బిస్తర్ పట్టుకుని పాదయాత్రకు తరలి రావాలని తెలంగాణ యువతను కోరారు.  లిక్కర్  స్కాంలో సీఎం కుటుంబం అవినీతి బండారం బయటపడబోతోందని.. అందుకే కేసీఆర్ గజగజ వణుకుతున్నరని బండి సంజయ్ విమర్శించారు.రోజూ 10 పెగ్గులేసి 5 రగ్గులు కప్పుకుని పండుకుంటున్నారని విమర్శించారు.  లిక్కర్ స్కాం లో కాంగ్రెస్ ప్రమేయం కూడా ఉందని..ఈ స్కాంలో ప్రమేయమున్న ప్రతి ఒక్కరిని విచారణ చేయాలన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా పాదయాత్ర చేస్తే అడ్డుకుంటున్న కేసీఆర్... లిక్కర్ స్కాం దందా చేసే వాళ్లను కాపాడుతున్నారని విమర్శించారు.  


బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్ - వీడియో రిలీజ్ చేయడమే కారణం !


కేసీఆర్‌ను దేశమంతా అసహ్యించుకుంటోంది !


కేసీఆర్ తీరును దేశమంతా అసహ్యించుకుంటోందని బండి సంజయ్ అన్నారు.  పాదయాత్రకు కేంద్ర బలగాలు రప్పించాలని లేఖ రాసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని .. మీడియా వాస్తవాలు తెలుసుకుని రాయాలని కోరుతున్నానన్నారు.  మా కార్యకర్తలే మా బలగాలు.  వారే మాకు భద్రతగా ఉంటారని ప్రకటించారు. ఉదయం ఆయన  జనగామ పాంమ్నూరు వద్ద బండి సంజయ్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కవిత ఇంటి ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలపై  పోలీసుల దాడికి నిరసనగా  ఆయన దీక్షకు ఉపక్రమించారు.  దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేశారు.  


తెలుగు రాష్ట్రాల్లో జోరుగా రాజకీయ చదరంగం ! కీలక మార్పులకు "భేటీలు" గ్రౌండ్ ప్రిపేర్ చేసేశాయా ?


పాదయాత్ర ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ప్రారంభం 
 
శాంతి యుతంగా నిరసన తెలిపే హక్కును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాలరాస్తోందని బీజేపీ నేతలు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. లిక్కర్‌ స్కామ్‌లో కేసీఆర్‌ కుటుంబం పాత్రను తేల్చేంతవరకు తాము నిరసనలు కొనసాగిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. పాదయాత్రను పోలీసులు ఎక్కడ ఆపేశారో అక్కడి నుంచే ప్రారంభిస్తానని బండి సంజయ్ ప్రకటించారు. రేపట్నుంచే పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉంది. ముగింపు సభకు కూడా భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


ట్విటర్లో స్నేహం! భారతీయ యువకుడిని కలిసిన ఎలన్‌ మస్క్‌!