GHMC Meeting : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు రచ్చ రచ్చగా మారాయి. మీటింగ్ స్టార్టైన వెంటనే సిటీలో నెలకొన్న సమస్యలపై బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. టేబుల్స్ ఎక్కి నిరసన తెలిపారు. దీంతో మేయర్ బెంచీలు దిగాలని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సభ్యులను బయటకు పంపాలని మార్షల్స్ ను ఆదేశించారు. సభ ప్రారంభమైన వెంటనే బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. సిటీలోని సమస్యలపై నిలదీశారు. మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంట్రాక్టర్ల కాళ్లు మొక్కినా పనులు కావడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు.
హైదరాబాద్ సమస్యలపై చర్చించాలని బీజేపీ కార్పొరేటర్ల డిమాండ్
శానిటేషన్ సిబ్బందిని పెంచాలని.. ఎప్పటికప్పుడు చెత్తను సేకరించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. తాము ఎజెండాను కార్పొరేటర్లందరికి పంపించామని.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదని అని మేయర్ ప్రశ్నించారు. నిజంగా ఎజెండాపై ఏదైనా భేదాభిప్రాయం ఉంటే ముందే తనకు చెప్పాల్సిందన్నారు. బడ్జెట్ ఆమోదం అయిపోయింది.. స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదం పొందిందని చెప్పారు. మీరు సరైన డిస్కషన్ కావాలనుకుంటే సహకరించాలని మేయర్ కార్పొరేటర్లను కోరారు. పోడియం చుట్టుముట్టడం సరైనది కాదన్నారు.
ఎజెండా ప్రకారమే వెళ్తామన్న మేయర్ - పోడియం చుట్టుముట్టిన బీజేపీ కార్పొరేటర్లు
చర్చా సమయం వృథా చేయకుండా అందరూ సంయమనం పాటించాలని మేయర్ విజయలక్ష్మీ ఎంత కోరినా బీజేపీ సభ్యులు ఆందోళన కొన్సాగించారు. చర్చలు జరగాలి అనుకుంటే సహకరించాలన్నారు. మేయర్ పోడియం దగ్గరకు రావడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్లకు ఎలాంటి సమస్యలు దొరకడం లేదు కాబట్టి ముందస్తు ప్లాన్‌తో వచ్చారని ఆమె ఆరోపించారు. తాము ఎజెండాను అందరూ కార్పొరేటర్లకు ముందుగానే పంపించామని.. అప్పుడు మాట్లాడాల్సి ఉండేదని చెప్పారు.
బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన మధ్యనే 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఆమోదం
బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన మధ్యనే 2023-24 ఆర్థిక సంవత్సరానికి GHMC కౌన్సిల్ బడ్జెట్ ను అమోదించారు. మొత్తం 6 వేల 224 కోట్ల రూపాయల బడ్జెట్ కు స్టాండింగ్ కమిటీ అమోదం తెలిపింది. అజెండాపై అభ్యంతరాలు ఉంటే ముందే చెప్పి ఉంటే చర్చించే వాళ్లమన్నారు. బీజేపీ కార్పొరేటర్లకు ఎలాంటి సమస్యలు దొరకడం లేదు కాబట్టి ముందస్తు ప్లాన్‌తో వచ్చారని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆరోపించారు.
ప్రభుత్వ భవనాల పన్నులను చెల్లించాలని కాంగ్రెస్ డిమాండ్
మరో వైపు జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్పొరేటర్ల నిరసన తెలిపాురు. రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు ఆస్తి పన్ను చెల్లించాలని కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలో మలేరియా, డెంగ్యూ జ్వరాలతో ప్రజల ప్రాణాలు పోతుంటే జీహెచ్ఎంసీ వీటి నివారణకు కనీస చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.చివరకు ప్రగతి భవనానికి కూడా ఆస్తి పన్ను చెల్లించడం లేదని ఆరోపించారు.
మొదట మహారాష్ట్రపై కేసీఆర్ గురి - బీఆర్ఎస్ విస్తరణకు జనవరిలో పర్యటన !