హైదరాబాద్ శివారులోని కోకాపేట, పుప్పాలగూడ ప్రాంతాల్లోని భూముల వేలానినికి అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకాపేటలో నియోపోలిస్ పేరుతో భూములు ఉన్నాయి. వాటిని వేలం వేయడానికి గతంలోనే ఏర్పాట్లు చేశారు. కొన్ని భూములను వేలం వేశారు. అయితే ఆ తర్వాత హైకోర్టులో కొన్ని పిటిషన్లు పడటంతో ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరున వేలాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  పుప్పాలగూడ‌, ఖానామెట్‌ భూముల 117.29 ఎకరాలను ఆన్ లైన్‌లో వేలానికి పెట్టారు. ఈ వేలం పద్ధతిలో విక్రయించేందుకు టీఎస్‌ఐఐసీ ఆగ‌స్టులో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భూముల వేలంపై ప‌లువురు కోర్టుల్లో పిటిష‌న్లు దాఖ‌లైనా వేలం నిలిపివేయాలన్న ఉత్తర్వులు రాలేదు.


Also Read: హైదరాబాద్ పేరు మార్పు అంశం మరోసారి తెరపైకి.. హాట్ టాపిక్‌గా ఆ ట్వీట్..!


కానీ కొనుగోలుదారుల‌కు పూర్తి స్థాయిలో భ‌రోసా కలిగించేందుకు కోర్టు కేసులు ప‌రిష్కారం అయిన త‌ర్వాతే వేలం ప్రక్రియ నిర్వహించాలన్న ఆలోచన ప్రభుత్వం చేసి వాయిదా వేసింది. మొదటగా  కోకాపేటలో 49.9 ఎకరాలు హెచ్‌ఎండీఏ వేలం వేసింది. గరిష్టంగా ఒక ఎకరాకు  రూ.60.2 కోట్ల ధర పలికింది. రూ.31.2 కోట్లకు అత్యల్ప ధరకు హైమా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎకరం భూమి కొనుగోలు చేసిది.  వేలంపాటలో అత్యధిక ధర పెట్టిన కొనుగోలు చేసిన కంపెనీ ఆక్వా స్పేస్ డెవెలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ పదహారున్నర ఎకరాలను సొంతం చేసుకుంది. తర్వాత స్థానంలో రాజపుష్ప రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. సత్యనారాయణరెడ్డి మన్నె దాదాపుగా ఎనిమిది ఎకరాలు సొంతం చేసుకున్నారు.


Also Read: Harish Rao: పీయూష్ గోయల్ వ్యాఖ్యలు దుర్మార్గం, క్షమాపణ చెప్పాల్సిందే.. మంత్రి హరీశ్ డిమాండ్


ప్రెస్టిజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఏడున్నర ఎకరాలు.. ఇక శ్రీ చైతన్యకు చెందిన వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏడున్నర ఎకరాలు కొనుగోలు చేసింది. హైమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎకరం స్థలాన్ని దక్కించుకుంది. దాదాపుగా పదిహేడు ఎకరాలు కొన్న అక్వా స్పేస్ సంస్థ మైహోం గ్రూప్‌నకు చెందినది. ఎకరం కొన్న హైమా డెవలపర్స్ కూడా వారిదే. మొత్తంగా రూ. ఐదు వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం భూముల వేలం వేస్తోంది. 


Also Read: Consumer Court: సరకులు కొంటే క్యారీ బ్యాగ్ ఫ్రీ ఇవ్వాల్సిందే.. ఆ డీమార్ట్ లో మీ డబ్బులు తిరిగిచ్చేస్తారు వెళ్లండి!


అయితే ఈ భూముల వేలంలో పెద్ద ఎత్తున స్కాం జరిగిందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదులు కూడా చేశారు. దర్యాప్తు సంస్థలు పట్టించుకోకపోతే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వేలాన్ని రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 


Also Read: Hyderabad RRR Update: రెండు భాగాలుగా RRR.. నార్త్ సైడ్‌కు గ్రీన్ సిగ్నల్.. సౌత్ సైడ్‌ మరింత లేట్, కారణం ఏంటంటే..



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి