హైదరాబాద్‌లో ఓ కొత్త రకం వ్యాధి సోకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజుల కాలంలోనే 15 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరంతా ప్రస్తుతం నగరంలోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి పేరు స్ర్కబ్ టైఫస్ లేదా బుష్ టైఫస్ అని పిలుస్తున్నారు. అయితే, ఇది సోకిన వారిలో ఎక్కువగా పిల్లలే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెలలో నలుగురు చిన్నారులు గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఇద్దరికి తగ్గిపోగా.. మరో ఇద్దరు చికిత్స తీసుకుంటున్నారు.


అసలేంటి ఈ స్ర్కబ్ టైఫస్
ఇళ్లలో, పెరటి మొక్కల్లో, చిత్తడి ప్రాంతాల్లో ఉండే నల్లులు లేదా చిన్న చిన్నగా ఉండే పురుగులు(లార్వల్ మిట్స్) కుట్టడం ద్వారా ఈ వ్యాధి సోకుతుందని నిపుణులు గుర్తించారు. ఇళ్లలో మంచాలు, తడి ప్రాంతాల్లో ఈ పురుగులు ఎక్కువగా ఉంటాయి. నల్లుల తరహాలో తిరుగుతూ ఉంటాయి. ఎక్కువగా రాత్రి సమయాల్లో వీటి ప్రభంజనం ఉండడం వల్ల ఆ సమయంలోనే ఎక్కువగా కుడుతుంటాయి. ఈ పురుగులు కుట్టడం వల్ల తీవ్రమైన జ్వరం, ఒళ్లు, కండరాల నొప్పులు వస్తున్నాయి. కొందరిలో ఒంటిపై ఎర్రటి దద్దుర్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలుంటే సత్వర చికిత్స తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఈ పురుగులు ఎక్కువగా చెట్ల పొదలు ఉన్న ప్రాంతంలో సంచరిస్తుంటాయని.. కాబట్టి పిల్లలను ఆ ప్రాంతాలకు వెళ్లనివ్వకుండా ఉండడమే మంచిదని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సూచించింది. అంతేకాకుండా చిన్నారుల శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వాడాలని సూచించింది.


యూపీలో గత సెప్టెంబరులోనే..
ఈ పురుగు ప్రభావం గత ఆగస్టు - సెప్టెంబరు మధ్య ఉత్తర్‌ ప్రదేశ్‌లో వెలుగు చూసింది. అప్పటికే అక్కడ చాలా మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారని వార్తలు వచ్చాయి. కొంత మంది మరణించినట్లుగా కూడా 3 నెలల క్రితం వార్తలు వచ్చాయి.


ఆ సమయంలో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం.. స్క్రబ్ టైఫస్‌ అనేది ఓరియెంటియా త్సుత్సుగముషి (Orientia Tsutsugamushi) అనే బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. చిగ్గర్స్ (Larval Mites) అనే పురుగు కాటు ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. దీన్ని ‘ష్రబ్‌ టైఫస్’ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి నివారణకు ప్రస్తుతం ఎటువంటి టీకాలు అందుబాటులో లేవని సీడీసీ తెలిపింది.


లక్షణాలు ఇలా..
ఈ పురుగు కుడితే వారిలో ముందు 10 రోజుల వరకు జ్వరం, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, ఒళ్లంతా దద్దుర్లు వంటి లక్షణాలు గుర్తించారు. వ్యాధి బారిన పడిన వారి నుంచి దూరంగా ఉండాలని సూచించింది.


Also Read: Weather Updates: తెలంగాణలో 11 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌.. చలి గాలులకు వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు


Also Read: Omicron Cases in India: దేశంలో 200 దాటిన ఒమిక్రాన్ కేసులు.. 3 రోజుల్లోనే డబుల్


Also Read: Nellore Crime: ఇంటి నుంచి బయటికెళ్లిన కొడుకు.. వచ్చి చూస్తే షాక్.. అసలేం జరిగిందంటే..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి