హైదరాబాద్ పేరు మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఈ అంశంపై కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ నాయకులు కొందరు హైదరాబాద్ పేరు మార్చుతామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ పేరు మార్చుతామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చుతామని చెప్పారు. తమ రాష్ట్రంలో ఫైజాబాద్‌ను అయోధ్యగా, అలహాబాద్‌ను ప్రయాగ్ రాజ్‌గా మార్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఇదే తరహాలో హైదరాబాద్ పేరును కూడా భాగ్య నగర్‌గా మారుస్తామని అన్నారు. ఈ విషయం అప్పట్లో వివాదాస్పదం కూడా అయింది. ఆ సంగతి ఆ ఎన్నికలతోనే ముగిసిపోయినా.. తాజాగా అది మరోసారి తెరపైకి వచ్చింది.
ఆర్ఎస్ఎస్ ట్వీట్‌తో దుమారం
2022 ఏడాది జనవరి మొదటి వారంలో హైదరాబాద్ నగరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) 3 రోజుల సమన్వయ్ బైఠక్ సమావేశాలను ఏర్పాటు చేసింది. కార్యక్రమ షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ దుమారం రేపుతుంది. అందులో హైదరాబాద్‌కు బదులు ఏకంగా భాగ్యనగరం అనే పేరును వాడారు.
‘సామాజిక జీవితంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ స్ఫూర్తితో వివిధ సంస్థల ముఖ్య కార్యకర్తల సమన్వయ్ బైఠక్ (సమన్వయ సమావేశం) 2022 జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు తెలంగాణలోని భాగ్యనగర్‌లో జరగనుంది’ అంటూ ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకార్ ట్వీట్ చేశారు.
ఇలా హైదరాబాద్‌కు బదులుగా భాగ్యనగర్ అని పేర్కొనడంపై దుమారం రేగుతున్నది. గత అసెంబ్లీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ నాయకులు హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చుతామంటూ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆ సమయంలో ఈ విషయంపై నిరసనలు వ్యక్తమయ్యాయి.
Also Read: Harish Rao: పీయూష్ గోయల్ వ్యాఖ్యలు దుర్మార్గం, క్షమాపణ చెప్పాల్సిందే.. మంత్రి హరీశ్ డిమాండ్
Also Read: TSRTC: తెలంగాణ ఆర్టీసీ గ్రేట్ ఆఫర్.. వంద టికెట్‌పై రూ.20 డిస్కౌంట్, వీరికి మాత్రమే..