Pushpa Ticket Price In Telangana : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ "పుష్ప 2" సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. "పుష్ప 2" దీంతోపాటు అర్ధరాత్రి బెనిఫిట్‌షోలకు కూడా అనుమతి ఇచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదు విడుదల కానున్న పాన్ ఇండియా మూవీ "పుష్ప 2" విడుదలకానుంది. ఈ సినిమా తెలంగాణ వ్యాప్తంగా ఈ సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. డిసెంబర్ ఐదు నుంచి ఎనిమిదోతేదీ వరకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లో 200 రూపాయలు వరకు పెంచుకోవచ్చు. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో 150 రూపాయలక వరకు టికెట్ల రేటు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
టికెట్ల రేటు పెంపుతోపాటు మరో గుడ్ న్యూస్ కూడా "పుష్ప 2" చిత్ర యూనిట్‌కు ప్రభుత్వం చెప్పింది. బెనిఫిట్ షోలు వేసుకునేందుకు కూడా ప్రభుత్వం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ నాల్గో తేదీ రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు. నాలుగు రోజుల పాటు అర్ధరాత్రి 1 షోలు కూడా వేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బెనిఫిట్ షోకు సంబంధించిన టికెట్ ధరలను సర్కారు ఖరారు చేసింది. సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌ల్లో బెనిఫిట్ షోకు టికెట్ ధర 800 రూపాయలుగా పేర్కొన్నారు.
తెలంగాణలో కొత్త రిలీజ్ అయ్యే ఏ సినిమా టికెట్ రేట్లు అయినా పెంచుకోవాలంటే మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా వీడియో చేయాలన్నది ప్రభుత్వం రూల్. ఈ రూల్ ప్రకారం పుష్క 2 యూనిట్ వివైధ్యంగా ఓ వీడియో చేసింది. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు.
డ్రగ్‌రహిత సమాజం కోసం తన వంతుగా అల్లు అర్జున్ చేసిన ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు. తెలంగాణ యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడేందుకు చేసిన ఈ ప్రయత్నంలో అల్లు అర్జున్ లాంటి నటులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి సామాజిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప 2 వచ్చే డిసెంబర్ ఐదున విడుదల కానుంది. పుష్ప 2 సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ఇంత బిజీగా ఉన్నప్పటికీ ప్రభుత్వానికి సహకరించాలని వీడియో సందేశం ఇచ్చారు. మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశం చేసుకోవద్దని యువతకు పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప 2' సినిమాను భారీ సంఖ్య స్క్రీన్స్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా రైట్స్ అమ్మకాలు కూడా భారీ ధరకు అమ్ముడైనట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 220 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని అంటున్నారు.
Also Read: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది