దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "పుష్ప 2" సినిమా గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక మేకర్స్ కూడా హైప్ కి తగ్గట్టుగానే తగ్గేదే లేదు అంటూ వరుసగా ప్రమోషన్లతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా బన్నీ సినిమా ప్రమోషన్స్ బాధ్యతను తన భుజాలపై వేసుకొని, ప్రతి ఈవెంట్ లోనూ స్పెషల్ గా పాల్గొంటున్నారు. ఇక అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఈవెంట్ ఎక్కడ పెట్టినా సరే లెక్కలేనంతమంది జనం సందడి చేస్తున్నారు. త్వరలోనే 'పుష్ప' టీం తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఇప్పటికే క్లోజ్ చేశారు. 'పుష్ప 2' మూవీ భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతోంది. అయితే ఇతర రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఎంత అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప 2'ను ఎంతకు అమ్మారంటే?
తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప 2' సినిమాను అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా షాక్ ఇచ్చే విధంగా ఉంది. ఆంధ్రాలో 90 కోట్లు, నైజాంలో 100 కోట్లు, సీడెడ్ లో 30 కోట్లకు ఈ సినిమా రైట్స్ కు సంబంధించిన డీల్ పూర్తయిందని సమాచారం. మొత్తంగా కలిపి చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 220 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక 'పుష్ప 2' సినిమాను రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ లో ఉండాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 215 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. పైగా దీనికి 18% జిఎస్టి, 20% కమిషన్, ప్లస్ థియేటర్ రెంట్లు, ఖర్చులు అదనం. ఈ లెక్కన చూసుకుంటే సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 450 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తేనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది. నిజానికి ఇది మామూలు టార్గెట్ కాదు.
ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమా 415 కోట్లతో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో 'బాహుబలి 2' మూవీ 330 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా ఉంది. ఇప్పుడు 'పుష్ప 2' మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 'ఆర్ఆర్ఆర్' సినిమాను మించిన కలెక్షన్స్ రాబట్టాలి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచినప్పటికీ, ఈ సినిమా 450 కోట్ల గ్రాస్ అందుకోవడం అంటే చిన్న కథ కాదు. ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావాలంటే మూవీకి యునానిమస్ గా హిట్ టాక్ రావడంతో పాటుగా, లాంగ్ రన్ లో ఏమాత్రం తగ్గకుండా వసూళ్ల పరంగా దూసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే 'పుష్ప 2'కు పోటీగా ఇప్పట్లో మరే సినిమా రిలీజ్ కావడం లేదు. సంక్రాంతి వరకు సోలోగా బాక్స్ ఆఫీస్ను పుష్పరాజ్ ఏలే ఛాన్స్ ఉంది. కానీ అప్పటిదాకా కూడా ఈ మూవీకి మంచి బజ్ ఉంటేనే మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుంది.
Also Read: అల్లు అర్జున్ మీద పోలీస్ కంప్లైంట్... ఫ్యాన్స్‌ను ఆర్మీ అంటే ఎలా?
అయితే తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప' మూవీకి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాలేదు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తం 400 కోట్లకు కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. కానీ 'పుష్ప 2'కు ఇప్పుడున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని చూస్తే 1000 కోట్లు కొల్లగొట్టడం పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు. అప్పట్లో ఉన్న టికెట్స్ రేట్స్ కూడా 'పుష్ప' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడానికి ఓ కారణం. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి లేదు. మొత్తానికి భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న పుష్పరాజ్ కలెక్షన్ల జాతర జరుపుతాడా? అనే విషయం తెలియాలంటే డిసెంబర్ 5 వరకు వెయిట్ అండ్ సీ.
Also Read: పుష్ప 2 సెన్సార్ బోర్డు రివ్యూ... అల్లు అర్జున్ సినిమాలో హైలైట్స్ ఏంటో తెలుసా?