తెలుగు రాష్ట్రాల్లో ప్రజల కంటే అమెరికాలో తెలుగు ప్రజలంతా మన సినిమా ప్రీమియర్ షోలు‌ చూస్తారు. కొన్ని రోజులుగా ఆ ట్రెండ్ మారింది. అమెరికాలో ప్రీమియర్ షోలు పడే సమయానికి తెలుగు రాష్ట్రాలలో బెనిఫిట్ షోలు కూడా వేయడం మొదలు పెట్టారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' చిత్రానికి కూడా బెనిఫిట్ షోలు వేయడానికి అనుమతులు వచ్చేశాయి.


'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ రేట్ @ 1000 ప్లస్!
డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 గంటల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 'పుష్ప 2' బెనిఫిట్ షోలు పడతాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిత్ర బృందం జీవో తెచ్చుకుంది. బెనిఫిట్ షో వేయడం ముఖ్యం కాదు... టికెట్ రేటు గురించి వచ్చిన జీవో ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చేలా ఉంది. 


డిసెంబర్ 4న రాత్రి వేసే 'పుష్ప 2' షోలకు అటు మల్టీప్లెక్స్, ఇటు సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేట్ మీద 800 రూపాయలు పెంచుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ లెక్కన మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 'పుష్ప 2' బెనిఫిట్ షో రేటు 1100కు పైగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు.


డిసెంబర్ 5న నుంచి డైలీ ఏడు ఆటలు
తెలంగాణ రాష్ట్రంలో మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రతి రోజు 5 ఆటలు వేసుకోవడానికి అనుమతి ఉంది. ఇప్పుడు 'పుష్ప 2' సినిమా కోసం మరో రెండు ఆటలు అదనంగా వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. 


డిసెంబర్ ఐదో తేదీ నుంచి ఉదయం ఒంటిగంటకు ఒక షో, అలాగే తెల్లవారు జామున 4 గంటలకు ఒక షో వేసుకోవచ్చు. ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్లలో 150 రూపాయలు మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 200 టికెట్ రేట్ మీద అదనంగా వసూలు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఈ జీవో డిసెంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అమలులో ఉంటుంది. 






ఆ తరువాత డిసెంబర్ 9 నుంచి 16వ తేదీ వరకు టికెట్ రేటు మీద సింగిల్ స్క్రీన్లలో 105 రూపాయలు పెంచుకోవచ్చు. డిసెంబర్ 17 నుంచి 23వ తేదీ వరకు టికెట్ రేట్ మీద 20 రూపాయలు పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. మల్టీప్లెక్స్ స్క్రీన్ల విషయానికి వస్తే... సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు 200 రూపాయలు, ఆ తరువాత డిసెంబర్ 9 నుంచి 16 వరకు 150 రూపాయలు, డిసెంబర్ 15 నుంచి 23 వరకు 50 రూపాయలు టికెట్ రేటు మీద అదనంగా వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.


Also Readపుష్ప 2 సెన్సార్ బోర్డు రివ్యూ... అల్లు అర్జున్ సినిమాలో హైలైట్స్ ఏంటో తెలుసా?



తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన అనుమతులు చూస్తే మొదటి రోజు పుష్ప భారీ రికార్డులు సాధించవచ్చు. ఒక్క మొదటి రోజు కలెక్షన్లు చూస్తే వరల్డ్ వైడ్ 300 కోట్లకు పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Also Readపుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో