గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' మూవీతో థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసిన చెర్రీ, 'గేమ్ ఛేంజర్' ఇంకా ప్రేక్షకుల ముందుకు రావడానికి టైం ఉండడంతో తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు. 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో 'RC 16' అనే వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే మూవీ షూటింగ్ ను షురూ చేశారు. తాజాగా ఈ సినిమాలో 'మీర్జాపూర్' ఫేమ్ మున్నా భయ్యా కీలక పాత్ర పోషించబోతున్నాడు అంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో 'ఆర్సీ 16' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మైసూర్ లో జరుగుతున్న షెడ్యూల్లో ఓ పాటకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ బుచ్చిబాబు మెగా ఫాన్స్ కి ఒక సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో 'మీర్జాపూర్'లో మున్నా భయ్యా పాత్ర పోషించి, పాపులర్ అయిన నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు దివ్యేందు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ సరిగ్గా గమనించి చూస్తేనే గాని ఆయన మున్నా భయ్యా అనే విషయం అర్థం కావట్లేదు. మొత్తానికి 'మీర్జాపూర్' సిరీస్ తో ఓవర్ నైట్ స్టార్ అయిన దివ్యేందు సరికొత్త ట్రాన్స్ఫర్మేషన్ తో... 'ఆర్సి 16'లో మెరవబోతున్నాడు అని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను ఈ ఒక్క పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు మేకర్స్.
ఇదిలా ఉండగా ఈ మూవీని బుచ్చిబాబు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే బాలీవుడ్ తో పాటు మున్నా భాయ్ గా ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న దివ్యేందు ఈ మూవీకి కచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతాడు. ఇక 'ఆర్సి 16'తో పాన్ ఇండియా ప్లాన్ చేసుకున్న బుచ్చిబాబు సినిమాలో మంచి క్యాస్టింగ్ తో పాటు టాలెంట్ టెక్నికల్ టీంను కూడా సెట్ చేసుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమా కన్నడ మార్కెట్ కోసం శివన్నని, బాలీవుడ్ మార్కెట్ కోసం దివ్యేందును, ఇంటర్నేషనల్ వైడ్ అప్పీల్ కోసం ఏఆర్ రెహమాన్ తీసుకున్నారు. మొత్తానికి బుచ్చిబాబు ప్లాన్ తో ఈ సినిమా స్టార్ట్ కాకముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.
Also Read: 'అమరన్' ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన Netflix... ఈ వారమే స్ట్రీమింగ్, ఎప్పుడంటే?
మరోవైపు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలను నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా... 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Also Read: పుష్ప 2 సెన్సార్ బోర్డు రివ్యూ... అల్లు అర్జున్ సినిమాలో హైలైట్స్ ఏంటో తెలుసా?