Free Biryani :   సరదాగా బిర్యానీ  ( Biryani ) తిందామని వెళ్తే.. ఏడాది మొత్తం ఉచితంగా తినవచ్చని ఆఫర్ ఇస్తే ఎలా ఉంటుంది ? ఉక్కిరిబిక్కిరి అయిపోము. అదే పరిస్థితి రక్షిత రెడ్డి కి ఎదురయింది. ఫేమస్ కదా అని ప్యారడైజ్ బిర్యానీ తిందామని... ఆ హోటల్‌కు రక్షిత రెడ్డి వెళ్లారు. తిని బిల్లు కట్టేటప్పుడు ఆ హోటల్ వాళ్లు షాకింగ్ న్యూస్ చెప్పారు. అదేమిటంటే... వారు అమ్మిన యాభై వేల బిర్యానీని ఆమె కొనుగోలు చేశారట. అయితే ఏంటీ.. తర్వాత కొనుక్కునేవాళ్లు యాభై వేల ఒకటో  బిర్యానీ కొనుక్కుంటారు.. ఏదైనా బిర్యానీనే కదా అని ఆమె మనసులో అనుకునేలోపే అసలు విషయం చెప్పారు.


గులాబీ తోటలో ఎర్రజెండా- తెలంగాణ పొలిటికల్ సర్కిల్‌లో ఇదే హాట్ టాపిక్


 యాభై వేలవ బిర్యానీ కొనుగోలుదారుడికి ఏడాది పాటు ఉచిత బిర్యానీని ఆఫర్ చేస్తున్నామని.. అందులో మీరే విజేతగా నిలిచారని చెప్పేశారు. దాంతో రక్షిత రెడ్డి ( Rakshita Reddy ) ఉక్కిరిబిక్కిరయిపోయింది. వెంటనే ఆమెతో కేక్ కట్ చేయించి.. ఆఫర్ కూపన్లు ( Offer Coupons ) చేతిలో పెట్టారు. ఏడాది మొత్తం తినొచ్చు కదా అని రోజు వచ్చి తింటారని అనుకున్నారేమో కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ ప్రకారం ..  ఏడాది పాటు తినొచ్చు..కానీ నెలకు ఒక్క సారే. అంటే పన్నెండు బిర్యానీలు ఫ్రీ అన్నమాట.  


బాసర ట్రిపుల్ ఐటీకి డైరెక్టర్ నియామకం, అయినా వెనక్కి తగ్గని స్టూడెంట్స్ - తాగునీటి నిలిపివేతపై ఏఎస్పీ క్లారిటీ


తమ ‘దిల్‌సే థాంక్యూ’ ( Dilse Thank YOu ) ప్రచారంలో భాగంగా తమ వినియోగదారులకు సేవలనందించాలనే  బ్రాండ్‌ లక్ష్యానికి అనుగుణంగా ఇది ఉంటుంది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా 3.5 మిలియన్‌ల మంది లాయల్‌  ప్యారడైజ్‌ సర్కిల్‌ ( Paradise Circle ) సభ్యులకు సేవలనందిస్తామని ప్యారడైజ్ ఓనర్లు చెబుతున్నారు.  బిర్యానీ ప్రేమికులంతా కూడా ప్యారడైజ్‌  సర్కిల్‌లో చేరడంతో పాటుగా ఉచిత బిర్యానీ పొందాలని యజమానాలు అంటున్నారు. ఉచిత బిర్యానీలతో  పాటుగా , ప్రతి 100 రూపాయల విలువ కలిగిన కొనుగోళ్లపై రెండు జెమ్స్‌ను ప్యారడైజ్‌ సర్కిల్‌ ద్వారా పొందవచ్చునని  ఈ జెమ్స్‌ను రివార్డ్స్‌ పాయింట్స్‌గా పంపిణీ  చేస్తామని.. వీటిని  ఏ సమయంలో అయినా రిడీమ్‌ చేసుకోవచ్చునని ప్యారడైజ్ ఓనర్లు చెబుతున్నారు. 


ప్రధాని, ఆదాని మీపై శ్రీలంకలోనూ ఆరోపణలు, నోరెత్తండి - ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్