ప్రధాని మోదీ, పారిశ్రామిక‌వేత్త గౌతమ్ అదానీని విమ‌ర్శిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి ప్రభుత్వ సంస్థల‌తో ప్రతిప‌క్ష నేత‌ల‌ను కేంద్రం టార్గెట్ చేయ‌డం సాధార‌ణ‌మేనని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే, శ్రీలంక విండ్ పవర్ (ప‌వ‌న విద్యుత్) కాంట్రాక్టుల్లో ప్రధాని మోదీ జోక్యం ఉంద‌ని ఆ దేశ సీనియ‌ర్ అధికారులే ఆరోపిస్తున్నారని అన్నారు. మ‌రి దీనిపై ప్రధాని మోదీ, అదానీ ఎందుకు స్పందించ‌డం లేదని మంత్రి కేటీఆర్ నిలదీశారు. శ్రీలంక పోర్ట్స్ అథారిటీ సూపర్ వైజర్ కలుతరాగే మాట్లాడిన ఓ వీడియోను కూడా కేటీఆర్ రీట్వీట్ చేశారు. 










యాక్టివిస్ట్ ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లను కూడా కేటీఆర్ రీట్వీట్ చేశారు. ‘‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నుంచి ఏడాదికి 1.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే స్థాయికి వచ్చారు. తాజాగా ఆయన ఆర్మీలో అగ్నివీర్ పేరుతో ఒక స్కామ్ ను ప్రకటించారు. ఇక్కడ సైన్యంలోకి రిక్రూట్ చేసుకొనే సైనికులు నాలుగేళ్లకే రిటైర్ అవుతారు. కానీ, భారత్, శ్రీలంకలోని పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పవర్ ప్లాంట్స్ లాంటివన్నీ అదానీకి కట్టబెడుతున్నారు. ఇది నిజంగా న్యూ ఇండియా’’ అని ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్ ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.






‘‘శ్రీలంకలో విండ్ పవర్ ప్రాజెక్టును ఆదానీ గ్రూపునకు కేటాయించేలా మోదీ, శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లుగా, ఆ దేశ ప్రభుత్వ సంస్థ అయిన Ceylon Electricity Board అధికారులు ఆరోపణలు చేశారు. కానీ, మన దేశంలోని బిజినెస్ ప్రెస్ ఈ వార్తలను కవర్ చేయలేదు.’’ అని ప్రశాంత్ భూషణ్ మరో ట్వీట్ చేయగా, దీన్ని కేటీఆర్ రీట్వీట్ చేశారు.