Reavnth Reddy Govt Serious Over Lagacharla Incident: వికారాబాద్‌ జిల్లా లగచర్లలో అధికారులపై జరిగిన దాడిలో 50 మందికిపైగా పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తతంగా మారకుండా ముందు జాగ్రత్తగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఆప్రాంతంలో ఇంటర్‌నెట్‌ కూడా నిలుపుదల చేశారు. ఇది అప్పటికప్పుడు జరిగిన ఘటన కాదని కుట్రపూరితంగా ముందస్త వ్యూహంతో జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా విచారణ చేస్తున్నారు. 


వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. దీని కోసం ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులను, సిబ్బందిపై స్థానికులు మూకుమ్మడి దాడి చేశారు. అరంగటలో ఆప్రాంతం రణరంగంగా మారింది. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, కడా స్పెషల్‌ ఆఫీసర్‌, పరిగి డీఎస్పీని పోలీసులు చుట్టుముట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. కలెక్టర్‌ను సైతం కొట్టేందుకు యత్నించింది. కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని వెంటపడి పొలాల్లోకి తీసుకెళ్లి చితకబాదారు. ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారు. 


Also Read: కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళా రైతు - ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస, వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత


జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని కర్రలతో వెంటాడారు. ప్రతీక్‌ జైన్‌పై ఓ మహిళ చేయి చేసుకుంది. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. వందల మంది పోలీసులను అక్కడ బందోబస్తుగా ఉంచారు.


ఇలా అధికారులపై దాడికి పాల్పడిన 50 మందికిపైగా గ్రామస్థులను పోలీసులు అరెస్టు చేశారు దుద్యాల, కొడంగల్‌, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలు పూర్తిగా నిలిపేశారు. లగచర్ల గ్రామంలో జరిగిన ఘటనపై ఐజి సత్యనారాయణ వివరాలు అందించారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి , ఒక డిఎస్పిపై తీవ్రంగా దాడి చేశారని తెలిపారు. భోగముని సురేష్ అనే వ్యక్తి కలెక్టర్‌ను నమ్మించి రైతుల వద్దకు తీసుకెళ్లారని వివరించారు. ముందస్తు ప్రణాళికతో కలెక్టర్‌పై ఇతర అధికారులపై దాడి చేశారని తెలిపారు. 


Also Read: కలెక్టర్‌పైనే దాడి చేసేలా తెలంగాణలో రాజకీయాలు - తెలంగాణ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?


ఈ దాడిలో సుమారు 100కుపైగా వ్యక్తులు ఉన్నారని పేర్కొన్నారు ఐజీ. పోలీసు విచారణ చేస్తున్నారని దాడికి పాల్పడిన వారిని ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమన్నారు. ఫార్మాసిటీ కోసం భూసేకరణ విషయంలో కలెక్టర్ మాట్లాడుతుండగా ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని తెలిపారు. ఈ దాడికి సురేష్ మరి అతని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో తెలుసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని మిగతా వారికి స్వల్ప గాయాలు అయినట్లు పేర్కొన్నారు. 


మరోవైపు ఈ అరెస్టులను బీఆర్‌ఎస్ ఖండించింది. అరెస్టులతో అక్కడ ప్రజాతిరుగుబాటును ఆపలేరని హెచ్చరించారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకుల బృందం లగచర్ల వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ ఊరికి వేరే వాళ్లను రానివ్వకుండా నియంత్రిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ బీఆర్ఎస్ బృందాన్ని వెళ్లనిస్తోందో లేదో చూడాలి. 


Also Read: కలెక్టర్‌పై గ్రామస్థుల దాడి - రేపటి నుంచి ఉద్యోగుల పెన్ డౌన్