Minister Talasani: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతే పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని సమీక్షా సమావేశం నిర్వహించారు. గృహలక్ష్మీ పథకంపై నగర ప్రజాప్రతినిధులతో చర్చించారు. సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు గృహలక్ష్మి పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ కార్యక్రమం కింద ఒక్కో నియోజక వర్గంలో 3 వేల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు వివరించారు. గృహలక్ష్మి పథకం నిరంతర కార్యక్రమం అని అర్హులైన వారికి గుర్తించేందుకు ప్రతి నియోజక వర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు చెప్పారు. 










స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారిని గుర్తించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. నగరంలో ఇండ్లు నిర్మించుకునేందుకు ఖాళీ స్థలాలు లేవని ప్రస్తుతం ఉన్న ఇంటిపై మరో నిర్మాణం చేసుకునేందుకు అవకాశం కల్పిచాలని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ వియాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో చర్చిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సురభి వాణిదేవి, రహ్మత్ బేగ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాద్, కాలేరు వెంకటేష్, కౌసర్ మోయినోద్దిన్, బలాల, మోజం ఖాన్, ముంతాజ్ ఖాన్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ స్నేహ శబరీష్ ఐఏఎస్, పీడీ సౌజన్య, వివిధ నియోజకవర్గాలకు చెందిన నోడల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. భుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. 










ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సచివాలయంలో నగర బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జీలు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణి దేవి, ప్రభాకర్ రావు, కార్పోరేషన్ చైర్మన్ లు ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నగేష్, నియోజకవర్గ ఇంచార్జీలు ఆనంద్ గౌడ్, నందు బిలాల్, బాక్రి, ఆజం అలీ, రాంరెడ్డి, సలా ఉద్దిన్ లోది, శ్యాంసుందర్ రెడ్డి, జీవన్ సింగ్, మాజీ కార్పొరేటర్ లు ఆకుల రూప, మమతా సంతోష్ గుప్తా, పరమేశ్వరి సింగ్, నివేదిత తదితరులు పాల్గొన్నారు.


Read Also: గృహలక్ష్మి పథకానికి భారీ స్పందన- నిధుల వచ్చేది అప్పటి నుంచే!