Manchu Mohan Babu Family Dispute: మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వారం క్రితం మొదలైన వివాదం టీవీ సీరియల్‌ను తలపిస్తోంది. రోజుకో మలుపు తిరుగుతోంది. మూడు రోజుల క్రితం అంతా కూల్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఇవాళ మళ్లీ వివాదం మొదటికి వచ్చినట్టు సమాచారం అందుతోంది. ఇంకోసారి పహడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించడం మరోసారి సంచలనంగా మారుతోంది. 


జనరేటర్ విషయంలో వివాదం


మంచు మనోజ్‌ మరోసారి పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు వెళ్లారనే విషయంపై ఇంకా క్లారిటీ రాకపపోయినా ఇంట్లో మరోసారి వివాదం చెలరేగిందనే టాక్ వినిపిస్తోంది. అందుకే మనోజ్ మరోసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్టు చెబుతున్నారు. జనరేటర్ విషయంలో మళ్లీ వివాదం నెలకొందని అంటున్నారు. 


మీడియా ప్రతినిధిని పరామర్శించిన మోహన్ బాబు


మరోవైపు గత మంగళవారం నాడు జల్‌పల్లిలో జరిగిన ఘర్షణలో ఓ టీవీ ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆయన్ని మంచు మోహన్ బాబు ఇవాళ పరామర్శించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసినట్టు సమాచారం. 


యశోధ ఆసుపత్రికి వెళ్లి మంచు మోహన్ బాబు తాను ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రతినిధిని కొట్టలేదని చెప్పుకొచ్చారు. అయినా తప్పు జరిగినందుకు జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. ఆయనతోపాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా సారీ చెప్పారు. 


Also Read: సైక్లింగ్ ద్వారా ప్రపంచాన్ని అన్వేషిస్తున్న యువకుడు- తండ్రి కలను నెరవేరుస్తున్న వరంగల్ వాసి


పోలీసుల విచారణకు హాజరుకాని మోహన్ బాబు


మరోవైపు హత్య కేసు విచారణలో భాగంగా మంచు మోహన్ బాబును విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. రివాల్వర్ అప్పగించాలంటూ మోహన్ బాబుకు నోటీసులు కూడా జారీ చేశారు. విచారణ టైంలో అప్పగిస్తామని మోహన్ బాబు సమాధానం ఇచ్చారు. కానీ ఇంత వరకు విచారణకు వెళ్లలేదని. మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదంపై ఇప్పటికే మనోజ్, విష్ణు స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. ఇంకా మోహన్ బాబు స్టేట్మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. 


అజ్ఞాతంలో ఉన్నారని ప్రచారం 


మోహన్ బాబు ఇంత వరకు పోలీసులను కలుసుకోలేదు. స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. రివాల్వర్‌ కూడా సరెండర్ చేయలేదు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదని పోలీసులు అంటున్నారు. ఇంత వరకు మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ ఈ మధ్యాహ్నం ఆయన తాను చేసిన దాడిలో గాయపడిన టీవీ ప్రతినిధిని పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు మాత్రం విడుదలయ్యాయి. 


దీంతో మోహన్ బాబు ఎక్కడ ఉన్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. హత్యకేసు నమోదు అవ్వడం, ఆయన విచారమకు సహకరించకపోవడంతో అరెస్టు ఖాయమంటున్నారు పోలీసులు. హైకోర్టులో కూడా ఆయనకు ముందస్తు బెయిల్ దొరకలేదు. అందుకే ఆయన బెయిల్ దొరికే వరకు పోలీసుల విచారణకు రాకపోవచ్చని అంటున్నారు. 


ఆస్తులు, ఇగో వివాదంతో గత ఆదివారం మంచు మనోజ్, మోహన్ బాబు ఇద్దరు వేర్వేరుగా ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లోఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో ఎప్పటి నుంచో ఉన్న వివాదం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు రాజీ కుదిరిందని అంతా అనుకున్నారు కానీ మళ్లీ వివాదం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. 


Also Read: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా