కెనడాలో తన భర్త తనను వదిలి ఒక్కమాట కూడా చెప్పకుండా వదిలి వెళ్లిపోయాడని హైదరాబాద్ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాను 2 నెలల గర్భవతి అని.. ఆరోగ్యం సరిగా లేదని ఆవేదనగా ట్వీట్ చేసింది.  ఇప్పటి వరకూ తన భర్త ఎక్కడున్నాడనేది తెలియదు తెలిపింది. అయితే ఈ విషయంపై భారత హై కమిషన్ కు ఆగస్టు 20,2021న ఫిర్యాదు చేసినా.. ఎలాంటి పురోగతి లేదని కేంద్రమంత్రి జైశంకర్ కు ట్వీట్ చేసింది.


'నా పేరు దీప్తి.. నేను మాంట్రియల్ కు మూడు నెలల క్రితం వచ్చాను. నా భర్త ఇక్కడే పని చేస్తారు. ఆయన నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆగస్టు 9వ తేదీన ఇండియాకు వెళ్లిపోయారు. ప్రస్తుతం నా భర్త, అతడి కుటుంబ సభ్యులతో నాకు ఎలాంటి కాంటాక్ట్ లేదు. ఆయన కుటుంబ సభ్యులందరూ నా ఫోన్ నెంబర్ ను బ్లాక్ లీస్టులో పెట్టారు. నేను రెండు నెలల గర్భవతిని నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ప్రయణాలు చేసే పరిస్థితిలో లేను.


నా భర్త తమ్ముడు హైదరాబాద్ లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తన్నాడు. నా భర్త, అత్తామామలను అతడే దాచి పెడుతున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. ఆయన ఆరోగ్యం గురించి భయంగా ఉంది. నా మానసిక స్థితి నన్ను చంపేస్తుంది. దయచేసి నా భర్త ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు నాకు సాయం చేయండి. ' అంటూ కెనడాలోని భారత హైకమిషన్ కు దీప్తి ఫిర్యాదు చేశారు. తన భర్తకు సంబంధించిన వివరాలన్నీ ఇచ్చారు.


అయితే భారత హైకమిషన్ కు దీప్తి చేసిన కంప్లైంట్ ను విదేశీ వ్యవహారాల శాఖకు పంపారు.  ఆ మహిళ భర్తకు సంబంధించిన వివరాలను కూడా ఇచ్చారు. ఇక అప్పటి నుంచి దీప్తి చేసిన కంప్లైంట్ పై ఎలాంటి పురోగతి లేదు.  ఫిర్యాదు చేసి చాలా రోజులు అవుతున్నా.. ఎలాంటి పురోగతి లేదని.. బాధితురాలు .. మళ్లీ.. తన ఆవేదనను ట్విట్టర్ ద్వారా తెలిపింది. కేంద్రమంత్రి జైశంకర్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్  చేసింది. 
దీప్తి ట్వీట్ ను చూసిన... రాచకొండ పోలీసులు స్పందించారు. అత్యవసరంగా ఎంక్వైరీ చేయాలని ఆదేశించారు. దీప్తీ తల్లిదండ్రులు తరఫు బంధువులు ఎవరైనా ఉంటే.. రాచకొండ సీపీని కలవొచ్చని ట్వీట్ చేశారు.


 





Also Read: Nellore Crime: గొంతులో బఠాణీ ఇరుక్కుని రెండేళ్ల బాలుడు మృతి.. కంటతడి పెట్టిస్తున్న ఘటన