Hyderabad IT Raids Live Updates: హైదరాబాద్‌లో 12 గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సహా వివిధ కంపెనీలకు చెందిన దుకాణాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.

ABP Desam Last Updated: 14 Oct 2022 06:18 PM
హైదరాబాద్‌లో 12 గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపు 12 గంటల పాటుగా ఐటీ తనిఖీలు సాగుతున్నాయి. ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్, బిగ్ సీ, లాట్ మొబైల్ షో రూమ్స్‌లో ఈ సోదాలు జరుపుతున్నారు. లాభాల్లో ఉన్న కంపెనీలను నష్టాల్లో యాజమాన్యాలు చూపించాయన్న ఆరోపణలతో సోదాలు జరుగుతున్నాయి. నష్టాలను చూపించి నిధులను వేరే సంస్థలోకి మళ్లించాయీ కంపెనీలు.

IT Raids in Hyderabad: హానర్ హోమ్స్ గ్రూప్ కంపెనీలపై ఐటీ సోదాలు

హానర్ హోమ్స్ గ్రూప్ కంపెనీలపై ఐటీ సోదాలు


హానర్ గ్రూప్ కంపెనీల లావాదేవీలపై ఐటీ శాఖ ఆరా


ఆర్ ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా, బిగ్ సి, లాట్ మోబైల్స్ షోరూంలపై కొనసాగుతున్న సోదాలు


హానర్స్ హోమ్స్ కో ఫౌండర్స్ స్వప్నకుమార్, వెంకటేశ్వర్లు, రాజమౌళి, బాలు చౌదరి స్వప్నకుమార్ నివాసాల్లో సోదాలు

RS Brothers IT Raids: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు



    • రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు





    • తెల్లవారుజాము నుండి 20 టీమ్స్ తో తనిఖీలు





    • హైదరాబాద్ లోని ఆర్ఎస్ బ్రదర్స్ ప్రధాన కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ తనిఖీలు





    • సౌత్ ఇండియా, లాట్ మొబైల్స్ లో సోదాలు





    • మూడు వ్యాపార సంస్థలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులపై ఆరా

    • ఇటీవల కాలంలో ఆయా సంస్థలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిన ఐటీ శాఖ



IT Raids: హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు


    • హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు





    • పది చోట్ల ఐటీ తనిఖీలు





    • మాదాపూర్, హైటెక్ సిటీతో పాటు మరో రెండు చోట్ల సోదాలు





    • పలు కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు





    • దాదాపు పది బృందాలతో కొనసాగుతున్న సోదాలు

    • హనర్స్, సుమధుర, ఆర్ ఎస్ బ్రదర్స్ కంపెనీలపై కొనసాగుతున్న ఐటీ సోదాలు


Background

హైదరాబాద్ లోని పలు చోట్ల ఆదాయ పన్ను శాఖ (ఐటీ) దాడులు చేపట్టింది. ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ బ్రాంచ్ లతో పాటు మరికొన్ని సంస్థలపై ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఏఖ కాలంలో 15కు పైగా బృందాలు భాగ్య నగరంలో దాడులు చేస్తున్నారు. అయితే ఆర్ఎస్ బ్రదర్స్ తో పాటు మరో రెండు స్థిరాస్తి సంసథల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆర్ఎస్ బ్రదర్స్ లోని ఆరు బ్రాంచీలు, ఇళ్లలో అధికారులు సోదాలు చేశారు. 


అయితే ఇటీవల కాలంలోనే ఆర్ ఎస్ బ్రదర్స్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టింది. హానర్స్ రియల్ ఇన్ఫ్రా  పేరు తో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అయితే ఈ హానర్స్ సంస్థ వాసవి తోపాటు పలు ప్రాజెక్టులు చేపట్టింది. కూకట్ పల్లిలలోని గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదాల్లో కూడా ఈ సంస్థ జోక్యం చేసుకుంది. వాసవి, సుమధురతో కలిసి కూడా ఆర్ఎస్ బ్రదర్స్ వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే హానర్స్, సుమధుర, వాసవి, పరంపర, ఆర్ఎస్ బ్రదర్స్ కార్యాలయాలపై ఐటీ దాడులు చేస్తోంది. 


సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కూడా..


ఉదయం 9 గంటల నుండీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కూడా ఐటీ దాడులు కనసాగుతున్నాయి. అయితే లోపల ఉన్న సిబ్బందిని బయటకు రానీయకుండా, బయట ఉన్న సిబ్బందిని లోపలికి వెళ్లనివ్వకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే షాపింగ్ మాల్ లో ఉన్న ఉద్యోగులందరి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలు హార్డ్ డిస్క్ లు, బ్యాంక్ ఖాతాల ను పరిశీలిస్తున్నారు. అదే కాకుండా కూకట్ పల్లిలోలని లాట్ మెబైల్స్ లో కూడా సోదాలు జరుగుతున్నాయి.


వరుసగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలపై దాడులు 


తెలంగాణలో రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. భారీ భవనాల నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఫీనిక్స్ కంపెనీపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. నానక్ రామ్ గూడ, గోల్ఫ్ ఎడ్జ్ , మాదాపూర్ లోని ఫీనిక్స్ ఐటీ సెజ్ లలో ఉన్న ఫీనిక్స్ కార్యాలయాల్లో తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు సోదాలు కొనసాగాయి. ముంబై నుంచి వచ్చిన 8 మంది ఐటీ అధికారుల బృందం విస్తృత సోదాలు చేసి, పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. కంపెనీకి చెందిన మొత్తం 20 చోట్ల ఐటీ రైడ్స్ జరిగాయి.


ఫోనిక్స్ గ్రూపు కార్యాలయాలు, యజమానుల ఇళ్లల్లో సోదాలు


సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేశారు. ఫీనిక్స్ సంస్థ రియల్ ఎస్టేట్ వెంచర్స్, రియల్ ఎస్టేట్ ఇన్ ఫ్రా సహా వివిధ రంగాల్లో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. లాక్ బుక్స్ నిర్వహణకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారుల నుంచి ఐటీ అధికారులు సేకరించారు. వివిధ ప్రాజెక్టుల పేరిట తీసుకున్న లోన్స్.. ఆయా ప్రాజెక్టులకే ఖర్చు పెట్టారా ? ఇతర కార్యకలాపాలకు దారిమళ్లించారా? అనే కోణంలో వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సోదాలన్నీ పూర్తయిన తర్వాత అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.