Hero Naga Chaitanya Car Fine: అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన కారు కిటికీలకు బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో ఈ విషయం గుర్తించిన పోలీసులు రూ.700 జరిమానా వేశారు. ఆ సమయంలో లోపల నాగ చైతన్య ఉన్నట్లు సమాచారం. 


టాలీవుడ్‌ హీరోలకు వరుసగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు విధిస్తున్నారు. రూల్స్ కేవలం సామాన్యులకే కాదు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తాయని అందరికీ తెలిసేలా పోలీస్ విభాగం వ్యవహరిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేసుకొని తిరుగుతున్న హీరోలు, సెలబ్రిటీలకు ఫైన్లు వేస్తూ వస్తున్నారు.


ఇటీవల హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, కళ్యాణ్ రామ్‌, మంచు మనోజ్‌ కార్ల అద్దాలకు బ్లాక్‌ ఫిల్ములను తొలగించడమే గాక.. మోటారు వాహనాల చట్టం నిబంధనలను ఉల్లఘించినందుకు గాను ఒక్కొక్కరీకీ 700 రూపాయల చొప్పున చలాన్లు విధించిన సంగతి తెలిసిందే. మార్చి 20న ఎన్టీఆర్‌కు పోలీసులు ఫైన్ విధించారు. ఆ సమయంలో కారులో ఎన్టీఆర్‌ లేరు. డ్రైవర్‌ మాత్రమే ఉన్నాడు. డ్రైవరుతో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ కుమారుడు, మరో వ్యక్తి ఉన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న వారు స్పష్టంగా కనిపించాల్సిందేనని, బ్లాక్ ఫిల్మ్ కోటింగ్ ఉన్న అద్దాలు అమర్చడం నిబంధనలకు విరుద్ధం అనే సంగతి తెలిసిందే.


ఆ తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్, మంచు మనోజ్, దర్శకుడు త్రివిక్రమ్ కార్లకు కూడా జరిమానా విధించారు. వై కేటగిరి ఉన్న వ్యక్తులు మినహా ఇతర వ్యక్తుల కార్లకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిబంధనలు పాటించని కార్లకు జరిమానా విధిస్తున్నారు పోలీసులు. గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో ఈ రకం జరిమానాలు పెరుగుతున్నాయి. 


వాహనాల నిబంధనలు, 1989 - రూల్ 100 - విజువల్ లైట్ ట్రాన్స్ మిషన్ (VLT) నాలుగు చక్రాల వాహనాల్లో కిటికీలు, విండ్ షీల్డులు, వెనుక అద్దాలకు బ్లాక్ ఫిల్ములు వాడడం నిషేధం. లోపల ఉన్నవారు స్పష్టంగా కనిపించాలని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వై, జడ్ కేటగిరీలకు చెందిన ప్రముఖులకు మాత్రమే ఈ మినహాయింపు ఉంది.


Also Read: Hyderabad: ముప్పుతిప్పలు పెట్టిన మూడో క్లాసు బాలికలు - వాళ్ల ఫ్రెండ్ చెప్పింది విని అవాక్కైన పోలీసులు


Also Read: Akbariddin Owaisi: పదేళ్ల నాటి ఒవైసీ మాటలు, ఉమ్మడి ఏపీ అంతా దుమారం - నేడు కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ