హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ( Hyderabad Trafic Police ) నగర వాసులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ట్రాఫిక్ చలాన్లను కట్టేందుకు భారీ డిస్కౌంట్ ( Discount ) సౌకర్యం కల్పించారు. ఇప్పటి వరకూ వాహనాలపై ఉన్న చలాన్లు మొత్తం చెల్లిస్తే 75 శాతం రాయితీ ఇస్తారు. కార్లకు 50 శాతం, బస్సులకు 70 శాతం రాయితీ ఉంటుంది. మార్చి నెల మొత్తం తగ్గింపుతో చెల్లించి చలాన్లు క్లియర్ చేసుకునే అవకాశం ఉంది. ఇక తోపుడు బండ్లపై నమోదు చేసిన చలాన్లకు ఇరవై శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఆన్ లైన్, ఈ సేవ ద్వారా ( E seva ) చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు. 85 శాతం చలాన్లు ద్వి చక్ర వాహనాలు, ఆటోలపైనే ఉన్నాయి.
ఐదారేళ్ళ క్రితమే విడిపోయాం! రమ్య రఘుపతి అప్పులతో నాకు సంబంధం లేదు - నటుడు వీకే నరేష్
ఇవన్నీ సమాజంలో పేద వర్గాలకు సంబంధించినవే కావడం... కరోనా కారణంగా వారంతా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కారణంగా ఈ డిస్కౌంట్ నిర్ణయం తీసుకున్నట్లుగా ట్రాఫిక్ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మార్చి ఒకటి నుంచి చలానా ( Challan Link ) చెల్లింపునకు సంబంధించిన లింక్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ అవకాశం హైదరాబాద్ పరిధిలో ఉన్న మూడు కమిషనరేట్లకు మాత్రమే వర్తిస్తుంది. కరోనా కారణంగా ట్రాఫిక్ చలానాలు జారీ చేస్తున్నారు కానీ ఎవరూ కట్టడం లేదు. ఈ కారణంగా సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు ( 600 Crores ) చలాన్ల రూపంలో పెండింగ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఆర్థిక సంవత్సరం ముగియ నుండటంతో వీలైనంతగా చలాన్లు వసూలు చేసుకోవాలన్న లక్ష్యంతో కొత్త డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్టన్లుగా తెలుస్తోంది.అదే సమయంలో కరోనా కారణంగా ఆటోడ్రైవర్లు, వాహనదారులు ఆర్దికంగా చితికిపోయిన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు చలాన్ల విధించడంపైనే ఎక్కువగా దృష్టిపెడతారన్న విమర్శలు ఉన్నాయి. సీసీ కెమెరాల ద్వారా చూసి కూడా ఫోటోలు తీసి చలానాలు ఆన్‌లైన్‌లో విధిస్తున్నారు. అయితే ఇలాంటి చలానాలన్నింటినీ తక్కువకే క్లియర్ చేసుకునే అవకాశం కల్పించడం హైదరాబాద్ వాసులకు ఓ రకంగా ప్రయోజనకరమే. భారీగా డిస్కౌంట్లు ప్రకటించడంతో ఎక్కువ మంది తమ వాహనాలపై ఉన్న చలాన్లను క్లియర్ చేసుకునే అవకాశం ఉంది.