Mir Osman Ali Khan: హైదరాబాద్ రాష్ట్రా ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 55 ఏళ్ల క్రితం ఇదే రోజున మరణించారు. 1967 ఫిబ్రవరి 24న మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాలకి కింగ్‌ కోఠీలోని కోటలో ఆయన కన్నుమూశారు. 


అప్పట్లో ప్రపంచంలోనే ధనికుడిగా పేరున్న నిజాం మరణం, అంత్యక్రియలు హైదరాబాదీలకు గుర్తుండిపోయే సంఘటన. లక్షల మంది చివరి చూపు కోసం కింగ్‌ కోఠీ కోట(king koti palace) చేరుకున్నారు. బస్సులు, ఎద్దుల బండ్లు, రైళ్లలో హైదరాబాద్‌కు(Hyderabad)కి తరలివచ్చి నిజాం పార్థివ దేహానికి నివాళి అర్పించారని ఆయన వారసులు చెబుతుంటారు.


అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ(Indiragandhi), సంజయ్ గాంధీ(Sanjay Gandhi)తో కలిసి నిజాంకు నివాళులర్పించేందుకు హైదరాబాద్‌ వచ్చారు. మాజీ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌(Rajendra Prasad)తో పాటు పలువురు వీఐపీలు కూడా నివాళులర్పించారు. 


మరణించిన రోజు జనం భారీగా రావడంతో ఆ తర్వాత రోజు అత్యంక్రియలు జరిపారు. అంత్యక్రియలకు పార్థివ దేహాన్ని తీసుకెళ్లే అంతిమయాత్రలో హైదరాబాద్‌లో ఎన్నడూ చూడని విధంగా సాగింది. కింగ్ కోఠీ లోని మస్జిద్-ఎ-జూడీ నుంచి చార్మినార్ మక్కా మసీదు మధ్య ఐదు కిలోమీటర్ల మార్గం ప్రజలతో నిండిపోయింది. నిజాం అంతిమ యాత్రలో దాదాపు 8 లక్షల మంది పాల్గొన్నారు.


ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 25, 1967న ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గౌరవ సూచకంగా ప్రభుత్వ కార్యాలయాలు మూసిశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను అవనతం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినం పాటించారు. 


ఏప్రిల్ 6, 1886న జన్మించిన ఉస్మాన్ అలీఖాన్ 1911 నుంచి 1948 వరకు హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించారు. 1948నాటి పోలీస్ చర్య "ఆపరేషన్ పోలో " ద్వారా  హైదరాబాద్ ఇండియన్ యూనియన్‌లో చేరిన తర్వాత, అతను 1948లో రాష్ట్ర రాజప్రముఖ్‌గా నియమితుడయ్యాడు. 1956 వరకు ఆ పదవిలో కొనసాగాడు. 


స్వాతంత్య్రం వచ్చేసరికి నిజాం అన్నా ఆయన పాలన అన్నా విపరీతమైన కోపం ఉండేది జనాలకు . కారణం నిజాం సన్నిహితుడు ఖాసీం రిజ్వీ కింద పని చేసే రజాకార్లు. స్వాత్రంత్య భారతావనిలో కలవాలనుకున్న హైదరాబాదీ ప్రజల పై కర్కశంగా రజాకార్లు చేసిన దురాగతాలు ఇప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో మాయని గాయలగా మిగిలాయి . 




నిజాం గురించి చెప్పుకోటానికి ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి. 1952లో రాజప్రముఖ్‌గా దిల్లీ (Delhi) వెళ్లాలి. అయితే నిజాంకు విమానంలో వెళ్లాలంటే భయం. గమ్మత్తైన విషయం ఏంటంటే 1945లో టాటా ఎయిర్‌లైన్స్‌(tata airlines)తో కలిసి నిజాం ఆధ్వర్యంలో డెక్కన్‌ ఎయిర్‌వేస్‌ (deccan airways) ప్రారంభమైంది. కానీ నిజాంకి విమానంలో వెళ్లాలంటే భయం. మధుసూధన రెడ్డి ప్రోత్సాహంతో నిజాం డోగ్లాస్‌ డీ త్రీ డకోటా ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎక్కారు. తన వ్యక్తిగ వైద్యుడు కల్నల్‌ డాక్టర్ కేఎన్‌ వైఘే తో కలిసి మొదటిసారి విమానం ఎక్కి టెస్ట్‌ రైడ్‌కు వెళ్లారు.


హైదరాబాద్ నిజాం చివరి దశలో నిర్మించిన కట్టడాలు ఇప్పటికి వారసత్వ కట్టడాలుగా నిలిచిపోయాయి. ఆనాటి విశేషాలు చెప్తూనే ఉన్నాయి. 
అలాంటి వాటిలో కొన్ని...


ఉస్మానియా యూనివర్సిటీ


ఉస్మానియా జనరల్ హాస్పిటల్


నిజాం హాస్పిటల్ (ఇప్పుడు నిమ్స్)


ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ (రెండు తాగునీటి రిజర్వాయర్లు)


మూసీ నదిపై నయాపూల్ వంతెన


బేగంపేట విమానాశ్రయం


నిజాం స్టేట్ రైల్వేస్


వరంగల్‌లోని ఆజం జాహీ టెక్స్‌టైల్ మిల్స్


హైకోర్టు భవనం


అసెంబ్లీ భవనం


నాంపల్లి రైల్వే స్టేషన్


జూబ్లీ హాల్


ఇవన్నీ అప్పటి నిజాం కట్టించిన భవనాలే. 


1965లో భారత దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కోరిక మీద 33000 బంగారం నాణేలు నేషనల్ డిఫెన్స్ గోల్డ్ ఫండ్‌కు అందజేశారు నిజాం.  


అయితే నిజాం  .. నియంతగా ... ప్రచారం జరిగినా చనిపోయిన తర్వాత తన అంతిమ యాత్రలో లక్షల మంది జనాల అభిమానాన్ని పొందిడం కూడా అంతే వాస్తవం.