Revanth Reddy Delhi Tour : తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)....ప్రత్యేక విమానంలో ఢిల్లీ (Delhi)వెళ్లారు. ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Cs) శాంతికుమారి(Shanthi Kumari), డీజీపీ (Dgp) రవిగుప్తా (Ravi Gupta), ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్ రెడ్డి కూడా హస్తినకు వెళ్లారు. రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు.  సాయంత్రం జరిగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు. 


కాంగ్రెస్ అగ్రనేతలను కలవనున్న రేవంత్ రెడ్డి...నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఇతర అంశాలపై చర్చించనున్నారు. 14న దావోస్ కు వెళ్తున్న ముఖ్యమంత్రి, అంతలోపే కార్పొరేషన్ పదవులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పని చేసిన నేతల జాబితాను రేవంత్ రెడ్డి తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులపై ఇప్పటికే ఓ అవగాహణకు వచ్చినట్లు సమాచారం. హైకమాండ్ అనుమతి తీసుకున్న తర్వాత పదవులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 


మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఇప్పటికే అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డితో పాటు సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కూడా అమిత్ షాను కలిసే ఛాన్స్ ఉంది. పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులు, పునర్విభజన సమస్యలు, షెడ్యూల్ 9,10 అంశాలపై చర్చించనున్నటులు తెలుస్తోంది.


TOP Telanagana News



'వైఎస్సార్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా' - ఆర్డర్ వేస్తే 'అండమాన్'లో బాధ్యతైనా నిర్వరిస్తానన్న షర్మిల




    వైఎస్సార్ జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేశారని, బిడ్డగా తాను ఆయన అడుగుజాడల్లో నడుస్తానని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో గురువారం విలీనం చేశారు.


 



ప్రయాణికులకు అలర్ట్ - రేపటి నుంచి అద్దె బస్సులు బంద్




    రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు అద్దె బస్సుల యజమానులు ప్రకటించారు. 'మహాలక్ష్మి' పథకం వల్ల బస్సుల నిర్వహణ భారంగా మారిందని, బస్సులు మరమ్మతులకు గురవుతున్నాయని తెలిపారు.


 



బీఆర్ఎస్‌గా పేరు మార్చేసి తెలంగాణనే ఎజెండా అంటే నమ్ముతారా ?




    భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుని తెలంగాణ వాయిస్ అంటే ప్రజలు నమ్ముతారా ? వ్యూహాత్మక తప్పిదం బీఆర్ఎస్‌ను ఇంకా వెంటాడుతోందా ?


 



ఎడ్లవాడలో గులాబీ విరిసేనా? పార్లమెంట్ ఎన్నికల్లో కారు స్పీడు పెరుగుతుందా?




    రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కారుస్పీడు పెంచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు.