International Yoga Day 2022: యోగాభ్యాసం మనిషి యొక్క శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. యోగాను నియమం తప్పకుండా అభ్యాసం చేయాలని తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచమంతా యోగాను అంగీకరించడం మన సంస్కృతికి దక్కిన గౌరవం అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. 8 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఘనంగా నిర్వహించాయి.
రుషులు, యోగా గురువుల గొప్పతనం అదీ..
అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. అందరికీ 8 వ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 15 దేశాలతో మొదలై ప్రస్తుతం 175 దేశాలకు యోగా దినోత్సవం నేడు విస్తరించిందనన్నారు. మన రుషులు, యోగా గురువుల గొప్ప తనాన్ని ప్రపంచమంతా అంగీకరించి గౌరవాన్ని ఇచ్చారని తెలిపారు. ఓంకారంతో ప్రారంభించబడే ఈ యోగా సాధన... షడ్ చక్రాల దర్శన భాగ్యం కలిగిస్తుందని, పూర్వకాలంలో మన రుషులు ఎంతో సాధన చేసి అందించిన ఈ ప్రక్రియను అందరూ కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. యోగా ద్వారా ఒక లక్ష్యంపై మనస్సు ఏకాగ్రతతో సాధించడం వీలవుతుందనన్నారు.
యోగా అంటే ఏమిటి ?
యోగం అంటే మనను మనం గెలుచుకోవడం అని అర్థం అన్నారు. పతంజలి మహర్షి చెప్పినట్లు చంచలమైన మనస్సును గట్టి పరచుకొని చిత్త ప్రవుత్తులను వశం చేసుకొని విజయపధాన సాగించానికి వీలవుతుందని చెప్పారు. మన గురువులు వ్యక్తి మనస్థత్వాన్ని బట్టి పలు రకాల యోగాను నిర్థేశించారని, తద్వారా మనిషిలో నిక్షిప్తమైన శక్తిని వెలికితీయడమే యోగాభ్యాస లక్ష్యమని తెలుసుకోవాలని సూచించారు. అంతే గాకుండా యోగాభ్యాసంతో అంతఃకరణ శుద్ది జరిగి, శరీర రుగ్మతలను నివారించుకోవచ్చని అంటూ యోగాను నిరంతరం అభ్యాసం చేసి దాని మంచి ఫలాలను అందుకోవాలని సూచించారు. యోగాను ఆచరించాలని తండ్రి ఎన్టీఆర్ సైతం చెప్పేవారని, ఆయన ఆచరించి చూపించారని ఈ సందర్భంగా బాలయ్య గుర్తుచేసుకున్నారు.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ యొక్క ప్రత్యామ్నాయ వైద్య విధాన విభాగం యాడ్ లైఫ్ వారి ఆధ్వర్యంలో 8 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాడ్ లైఫ్ యోగా విభాగాచార్యులు ఉదయ కుమార్ ప్రత్యేకమైన యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరై ప్రసంగించారు. ఓంకార స్వరం పలకడంతో ప్రారంభించిన ఈ యోగా కార్యక్రమంలో యాడ్ లైఫ్‌నకు చెందిన యోగా గురువు ఉదయకుమార్ అందరితో పలు రకాల యోగాసనాలు అభ్యాసం చేయించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గురువుగా వ్యవహరించిన ఉదయకుమార్‌ను బాలకృష్ణ సత్కరించారు.
Also Read: Yoga For Libido: లైంగిక సామర్థ్యాన్ని పెంచే యోగా భంగిమలు, ఈ ఆసనాలతో శృంగారంలో తిరుగే ఉండదట!
Also Read: International Yoga Day 2022: 17 వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు- గడ్డ కట్టే చలిలో ఎలా చేశారు భయ్యా!