Bahadurpura Flyover in Hyderabad: విశ్వనగరం హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ నేడు అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులలో భాగంగా నిర్మించిన బహదూర్ పురా ప్లైఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ పొడవు 690 మీటర్లు. నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయం, మహబూబ్ నగర్ జిల్లాల వైపు రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ కష్టాలు పరిష్కరించేందుకు పాతబస్తీలోని బహదూర్ పురా జంక్షన్ వద్ద టీఆర్ఎస్ సర్కార్ ఫ్లై ఓవర్ నిర్మించింది.






రూ.500 కోట్లతో పాతబస్తీలో డెవలప్‌మెంట్.. 
వీటితో పాటు దాదాపు రూ. 500 కోట్లతో చేపట్టనున్న ముర్గీచౌక్, మీరాలం మండి, సర్దార్ మహల్ ఆధునీకరణ మరియు  పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ సురభివాణి దేవి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అటు కొత్త నగరం, ఇటు పాత బస్తీ రెండిటినీ సమానంగా అభివృద్ధి చేస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.






ఆరాంఘర్ నుంచి ట్రాఫిక్ సమస్యలకు చెక్.. 
ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్డు చుట్టపక్కల ప్రాంతాల్లో అబుల్ కలాం ఆజాద్, బైరమల్ గూడ ఫ్లై ఓవర్‌లను ఇటీవల ప్రారంభించారు. తాజాగా బహదూర్ పుర ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో నగరంలోని పాతబస్తీ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలు దాదాపుగా తగ్గనున్నాయి. ఈ ఫ్లైవర్ ద్వారా తూర్పు ప్రాంతం నుంచి శంషాబాద్ వరకు, శంషాబాద్ నుంచి తూర్పు ప్రాంతం మధ్య రాకపోకలు సులభతరం కానున్నాయి. బహదూర్ పుర ఫ్లై ఓవర్ నిర్మాణం, భూ సేకరణ నిమిత్తం రూ.108 కోట్లు మేర రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అదే సమయంలో ఫ్లై ఓవర్ కింది భాగంలో సుందరీకరణ పనులకు సైతం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఫ్లై ఓవర్ ద్వారా ఆరాంఘర్ నుంచి ఉప్పల్ వరకు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. 






Also Read: Group 1 Notification: ఈ వారం నుంచే తెలంగాణలో ఉద్యోగాల జాతర - అదే రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ !


Also Read: Weather Updates: పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఇక కూల్ కూల్‌గా ఏపీ, తెలంగాణ - రైతులకు కీలక సూచన