అల్పపీడనం ప్రభావం ఏపీ, తెలంగాణలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలపై ఉంది. బంగాళాఖాతం నుంచి వీచే గాలులతో ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. యానాం, ఒడిశాలలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంట 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరశాఖ అధికారులు సూచించారు.
విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం నర్సీపట్నంలో, అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. నేటి నుంచి మరో రెండు రోజులపాటు ఉమ్మడి విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయిని అంచనా వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం-నర్సాపురం పరిధిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయి. కృష్ణా జిల్లా కైకలూరు దాక వర్షాలు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజమండ్రి, యానం, కొనసీమ ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు (Temperature in Andhra Pradesh) దిగొస్తున్నాయి. కాకినాడ జిల్లాలో ముఖ్యంగా అన్నవరం, పితాపురంలలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంబాల కింద, చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు.
కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని, పిడుగుల సూచన ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. బేతంచెర్ల-ఆధోనీ పరిధిలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా పశ్చిమ భాగాలు ముఖ్యంగా మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఈదురు
నల్లమల అటవీ ప్రాంతాలతో పాటు నందికొట్కూరు - నంద్యాల ప్రాంతాల్లో భారీ వర్షసూచన ఉంది.
తెలంగాణలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని, పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం (Telangana Temperature Today) లభించింది. అయితే రైతులు ధాన్యం ఆరుబయట నిల్వ ఉంచకూడదని, తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల నేడు సైతం చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు.
Also Read: Horoscope Today 19th April 2022: ఈ రాశివారికి ఈ రోజు అనుకోని ఖర్చులు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి