TSPSC Group 1 Notification: తెలంగాణలో ఈ వారం నుంచే ఉద్యోగాల నోటిఫికేషన్ల జాతర మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానిస్టేబుల్, ఎస్సై పోలీస్ జాబ్‌లకు వచ్చే వారం నోటిఫికేషన్ విడుదల కానుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సోమవారం తెలిపారు. అయితే అంతకంటే ముందు టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకే గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం తెలిపిందే.


గ్రూప్1 పోస్టుల భర్తీని ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి చేసేలా టీఎస్​పీఎస్సీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. కోర్టు కేసులు, ఇతర చిక్కులు లేకుండా ఉండేలా ఈసారి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ వారంలోనే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.  గ్రూప్1 పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టేందుకు ఏప్రిల్ 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని తెలుస్తోంది. అదేరోజు టీఎస్​పీఎస్సీ పూర్తిస్థాయి సమావేశం నిర్వహిస్తుండటంతో, గ్రూప్​ 1లోని 503  పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారని నిరుద్యోగులు సైతం భావిస్తున్నారు. 


గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగ నియామకాలపై అపోహలు తొలగించడంలో భాగంగా సీఎం కేసీఆర్ ఇదివరకే ఈ పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై టీఎస్‌పీఎస్సీ అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. మరోవైపు ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన ఉద్యోగాలలో గ్రూప్ 1 పోస్టులు ఉండటంతో.. ఏప్రిల్ 22న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అందించి అభ్యర్థులకు శుభవార్త అందించే అవకాశాలు లేకపోలేదు. అభ్యర్థులు ఓటీఆర్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు సూచించారు. ఈ నెలలో నోటిఫికేషన్ విడుదలైతే జూన్‌లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించే ఛాన్స్ ఉంది.

వచ్చే వారం పోలీస్ జాబ్ నోటిఫికేషన్   
వారం రోజుల్లో పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఉద్యోగార్థులు సిద్దంగా ఉండండని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అభ్యర్థులకు సోమవారం నాడు సూచించారు. అభ్యర్థుల కోరిక మేరకు 3 ఏళ్ల వయోపరిమితికి తెలంగాణ సీఎం కేసీఆర్ రిలాక్సేషన్ ఇచ్చారని మంత్రి హరీష్ తెలిపారు. కొత్త నోటిఫికేషన్ల ద్వారా 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసిన ఘనత కేసీఆర్ సొంతమన్నారు. పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం కోటా (Telangana Police Jobs Notification 2022) దేశంలో మరెక్కడా లేదన్నారు హరీష్ రావు.


Also Read: TS Police Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త - వారంలో పోలీస్ జాబ్స్‌కు నోటిఫికేషన్, సిద్దంగా ఉండండి


Also Read: Telangana Jobs 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, రాష్ట్రంలోని 6 వర్సిటీల్లో పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్