Virata Parvam : రానా దగ్గుబాటి(Rana Daggubati), సాయి పల్లవి(Sai Pallavai) హీరోహీరోయిన్ లుగా నటించిన విరాటపర్వం(Virata Parvam) సినిమాపై వీహెచ్‌పీ నేతలు ఫిర్యాదు చేశారు. వీహెచ్‌పీ నేత అజయ్‌రాజ్‌ హైదరబాద్ సుల్తాన్‌బజార్‌ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నక్సలిజం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించేలా ఈ సినిమా ఉందని, ఇలాంటి సినిమాల అనుమతిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విరాట పర్వం సినిమా యువతను పెడదారి పట్టించేలా  ఉందని ఆరోపించారు. ఈ సినిమా విడుదలకు అనుమతులిచ్చిన సెన్సార్‌ బోర్డుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. విరాటపర్వం మూవీ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు వేణు ఊడుగుల (Venu Udugula) దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌(Suresh Productions) నిర్మించింది. 


విరాటపర్వం కలెక్షన్స్ 


దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విరాటపర్వం'. ఈ సినిమాను వేణు ఊడుగుల డైరెక్ట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. జూన్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1990లలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన లవ్ స్టోరీ ఇది. ఇందులో దళ నాయకుడు రవన్న పాత్రలో రానా నటించగా.. వెన్నెల అనే అమ్మాయి పాత్రలో సాయిపల్లవి కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.14 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది. అంతకుమించి వసూళ్లు సాధిస్తేనే ఈ సినిమా సక్సెస్ అయినట్లు. అయితే ఆశించిన స్థాయిలో సినిమా కలెక్షన్స్ ను రాబట్టలేకపోతుంది. రెండోరోజే ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. 


రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.53 కోట్ల షేర్ సాధించింది ఈ సినిమా. దీన్ని గ్రాస్ పరంగా చూస్తే.. రూ.2.50 కోట్లు. కర్ణాటక-రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాకి రూ.20 లక్షలు వచ్చాయి. అలాగే ఓవర్సీస్ లో రూ.54 లక్షలు వచ్చాయి. అంటే మొత్తంగా ఈ సినిమా రూ.2.27 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ ప్రకారం చూస్తే.. రూ.3.90 కోట్లు. 'విరాటపర్వం'పై ఉన్న బజ్ కి వస్తోన్న కలెక్షన్స్ కి సంబంధమే లేదు. ఇదే గనుక కంటిన్యూ అయితే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టమే.  


Also Read : Prakash Raj Supports Sai Pallavi: సాయి పల్లవికి ప్రకాశ్ రాజ్ సపోర్ట్! అన్నిటికన్నా అదే ముందు అంటూ ట్వీట్