Hyderabad Rains : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రుతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, బేగంపేట్, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, కూకట్‌పల్లి, నిజాంపేట్, బాచుపల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్‌లో పాటు ఇతర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఆకాశం మేఘావృతమై ఉంది. వాతావరణ చల్లబడడంతో నగరవాసులకు ఎండల నుంచి ఉపశమనం లభించింది. వర్షం కారణం వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల నాలాలు పొంగిపొర్లడంతో వాహదారులు ఇబ్బందులకు గురయ్యారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. రుతుపవనాల రాకతో వారం రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి.
పలు జిల్లాలో మోస్తరు వానలు
రాష్ట్రంలోని పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుముల, 30 కి.మీల వేగంగా ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, భూపాలపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, జనగావ్, సిద్ధిపేట, వికారాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
విజయవాడలోనూ వర్షం
విజయవాడలోనూ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో పడిన భారీ వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వరదనీటిలో రోడ్లు మునిగిపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు అన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో ఆదివారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దక్షిణ కోస్తా ఒడిశా, పరిసర ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడా, కర్ణాటక, తమిళనాడు, విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి.