దేశంలో ఒమిక్రాన్ విజృంభించకుండా కేంద్రం కట్టుదిట్ట చర్యలు తీసుకుంటుంది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్ పోర్టులోని స్ర్కీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నా, లేక పాజిటివ్ వచ్చిన వారిని ప్రత్యేక ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఓ యువతి అధికారుల కళ్లు గప్పి తప్పించుకుపోయింది. ఎయిర్ పోర్టులో చేసిన కోవిడ్ నిర్థారణ పరీక్షలో యువతికి పాజిటివ్ వచ్చింది. అయినా ఆ విషయాన్ని దాచి యువతి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. 


Also Read: ఒమిక్రాన్ భయాల వేళ ఊరట.. దేశంలో 10 వేలకు దిగువనే కొత్త కేసులు


ఎయిర్ పోర్టు నుంచి తప్పించుకుని ఇంటికి


విదేశాల నుంచి వచ్చిన కోవిడ్ బాధితురాలు హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో  ప్రత్యక్షమైంది. కుత్బుల్లాపూర్‌కు చెందిన యువతి గురువారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా యువతికి పాజిటివ్ అని తేలింది. అధికారులు ఆమెను ఆసుపత్రికి తరలించే క్రమంలో అక్కడి నుంచి తప్పించుకున్న యువతి కుత్బుల్లాపూర్ రిడ్జ్ టవర్స్‌లో ఉంటున్న తల్లిదండ్రుల దగ్గరకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ సిబ్బంది పాస్‌పోర్ట్ ఆధారంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, వైద్యాధికారులు రిడ్జ్ టవర్స్‌కు చేరుకున్నారు. ఆ యువతి అక్కడి నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు గచ్చిబౌలి టిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ యువతికి చికిత్స అందించనున్నారు. 


Also Read: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక


మరో 12 మందికి కరోనా పాజిటివ్


దేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన వారిలో 12 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్థారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న, ఈరోజు బ్రిటన్, కెనడా, అమెరికా, సింగపూర్‌ నుంచి వచ్చిన 12 మందికి కరోనా నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన 12 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు తెలిపారు. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారిలో కరోనా లక్షణాలు కనిపించలేదన్నారు. ఒమిక్రాన్‌ నిర్ధారణ కాకపోతే వీరందరినీ హోం ఐసోలేషన్‌కు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు.


Also Read: 'ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి