Next Nizam Azmat Jah : హైదరాబాద్ నిజాం వారసుడిగా మీర్ మహ్మద్ అజ్మత్ అలీఖాన్ అజ్మత్ జా ఎంపికయ్యారు. అజ్మత్ జా తండ్రి ముకర్రమ్ జా మృతి అనంతరం ఆయన వారసుడిగా అజ్మత్ జాను నిజాం వారసుడిగా ఎంపిక చేశామని కుటుంబసభ్యులు ప్రకటించారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, నిజాం టస్ట్రీల మధ్య జరిగిన సమావేశంలో ఈ ప్రక్రియను నిర్వహించామని చౌమహల్లా ప్యాలెస్ ను అధికారికంగా ప్రకటన జారీ చేసింది. నిజాం చివరి వారసుడు ప్రిన్స్ ముకర్రమ్ జా వారం రోజుల క్రితం మరణించారు. ముకర్రమ్ జా కుమారుడు అజ్మత్ జాను నిజాం వారసుడిగా ఎంపిక చేశారు. 1960లో జన్మించిన అజ్మత్ జా లండన్‌లోనే చదువుకున్నారు. అనంతరం అజ్మత్ జా ఫొటోగ్రఫీని వృత్తిగా ఎంచుకున్నారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఫొటోగ్రఫీ పట్టా పొందిన ఆయన... హాలీవుడ్‌లో పలు సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ చేశారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు స్టీవెన్ స్పీల్‌బర్గ్, రిచర్డ్ అటెన్‌బరోలతో కలిసి పనిచేశారు. లండన్‌లో ఉంటున్న అజ్మత్ జా... వ్యాపారాలు, డాక్యుమెంటరీ చిత్రీకరణలతో పలుదేశాలకు వెళ్తుంటారు. తండ్రి ముకర్రమ్ జా అంత్యక్రియలు కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన ప్రస్తుతం పాతబస్తీలోని తన పూర్వీకుల నివాసంలో బస చేస్తున్నారు.
భారతదేశపు అత్యంత ధనవంతుడు
అజ్మత్ జా జూలై 23, 1960న ముకర్రమ్ జా మొదటి భార్య ప్రిన్సెస్ ఎస్రాకు జన్మించారు. ముకర్రమ్ జా ఇటీవల టర్కీలో మరణించారు. హైదరాబాద్ మక్కా మసీదులో ముకర్రమ్ జా అంత్యక్రియలు చేశారు. ఫిబ్రవరిలో చౌమహల్లా ప్యాలెస్‌లో అజ్మత్ జా ను అధికారికంగా కొత్త నిజాంగా ప్రకటించనున్నారు. మీర్ ముక్కారామ్ జా మరణంతో హైదరాబాద్ నిజాం వారసత్వం ముగిసింది. అనంతరం నిజాం వారసుడిగా ముకర్రమ్ ను నియమించారు. 1967లో చౌమహల్లా ప్యాలెస్‌లో అతనికి పట్టాభిషేకం జరిగింది. 1971 వరకు, అతను హైదరాబాద్ ప్రిన్స్ పిలిచేవారు. అతను 1980ల వరకు భారతదేశపు అత్యంత ధనవంతుడు అనే బిరుదును కలిగి ఉన్నాడు.
తొమ్మిదో నిజాం
హైదరాబాద్ ఎనిమిదో, చివరి అధికారిక నిజాం ప్రిన్స్ ముకర్రమ్ జా మరణం అనంతరం అతడి వారసుడిగా అజ్మత్ జా అలియాస్ మీర్ ముహమ్మద్ అజ్మత్ అలీ ఖాన్ తొమ్మిదో నిజాంగా ప్రకటించారు. అయితే 1971లో భారత ప్రభుత్వం నిజాం బిరుదులను రద్దు చేసింది. దీంతో అజ్మత్ జాకు తొమ్మిదో నిజాం అనే బిరుదు అధికారికంగా ఉండదు. అజ్మత్ జా ముకర్రమ్ జా మొదటి భార్య యువరాణి ఎస్రా సంతానం. గత వారం టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ముకర్రమ్ మరణించారు. హైదరాబాద్‌లోని మక్కా మసీదులో ముకర్రమ్ భౌతికాయం ఖననం చేశారు. ఫిబ్రవరి వరకు సంతాప దినాలు నిర్వహించనున్నారు. సంతాప దినాలు ముగిసిన అనంతరం హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్‌లో అజ్మత్ జా పట్టాభిషేకాన్ని అధికారికంగా నిర్వహించి తొమ్మిదో నిజాంగా ప్రకటించనున్నారు.