✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Adilabad Latest News: మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్‌లు- ఆదిలాబాద్‌లో కీలక ప్రకటన చేసిన ఎండి సజ్జనార్

Shailender   |  19 May 2025 09:58 PM (IST)
1

రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అద్భుతంగా కొనసాగుతుందని ఆర్టీసీ లాభాల బాటలో నడిపేందుకు మరింత కృషి చేస్తామని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు.

2

సోమవారం ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోను సందర్శించారు.

3

ఎండి సజ్జనార్‌ను ఆర్టీసీ డిపో ఆర్ఎం, డిఎం, ఆర్టీసీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

4

ఈ పర్యటనలో ఎండి సజ్జనార్ డిపో ఆవరణలో మామిడి మొక్క నాటి నీరు పోశారు.

5

డిపో అవరణలో మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు వేసవిలో నీడను, చల్లదనాన్ని మంచి గాలిని అందిస్తాయన్నారు.

6

ఆర్టీసీ డిపోను సందర్శించి అధికారులను ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులను వారి పని విధానాన్ని డిపోలో ఇంకా కావలసిన బస్సులు ఇతర సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

7

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ abp దేశంతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు.

8

ప్రస్తుతం రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అద్భుతంగా కొనసాగుతుందన్నారు. ఆర్టిసి ఉద్యోగులు కార్మికులు కూడా ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నారన్నారు.

9

ఆర్టీసీ సేవలను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లోనూ బీటి రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలలోనూ ఆర్టీసీ బస్సులను నడిపించేందుకు కృషి చేస్తామన్నారు.

10

ప్రజలు తమ సురక్షిత ప్రయాణానికోసం ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా కాబట్టీ ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థను మారుమూల గ్రామాల్లో మెరుగుపరుస్తు ప్రజలకు చేరువలో ఉండేలా చూస్తామన్నారు.

11

గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆర్టీసి సేవలను మరింతగా అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆర్టీసి సిబ్బంది చాలా బాగా పనిచేస్తున్నారన్నారు. ఇదివరకే 3300 కొత్త బస్సులను తీసుకోవడం జరిగిందని, రానున్న రోజుల్లోనూ మరిన్ని కొత్త బస్సులను తీసుకొని ప్రజలకు చెరువులో రవాణా సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామన్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • నిజామాబాద్
  • Adilabad Latest News: మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్‌లు- ఆదిలాబాద్‌లో కీలక ప్రకటన చేసిన ఎండి సజ్జనార్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.