Master Bharath: మాస్టర్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదం - ఆయన మాతృమూర్తి కన్నుమూత
Ganesh Guptha | 19 May 2025 12:50 PM (IST)
1
మాస్టర్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి కమలహాసిని ఆదివారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు.
2
ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. దీంతో ఆయనకు పలువురు సెలబ్రిటీలు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. బంధుమిత్రులు ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు.
3
గత కొంతకాలంగా భరత్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇలాంటి టైంలో తల్లిని కోల్పోవడంతో తీవ్ర వేదనకు గురవుతున్నారు. బంధుమిత్రులు ఆయనకు ధైర్యం చెబుతున్నారు.
4
తెలుగులో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా భరత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకీ, రెడీ, ఢీ, కింగ్, బిందాస్, మిస్టర్ పర్‌ఫెక్ట్ ఇలా దాదాపు 80 తెలుగు సినిమాల్లో తనదైన నటనతో మెప్పించారు.
5
గతేడాది రిలీజ్ అయిన విశ్వం సినిమాలో చివరిగా కనిపించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో భరత్ నటించారు. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చేస్తున్నారు.