Officials Rescued Police Forces In Warangal: భారీ వర్షాలు.. విధి నిర్వహణలో అడవిలోకి వెళ్లిన వారు అక్కడే చిక్కుకుపోయారు. బయటపడే మార్గం లేక గత 3 రోజులుగా ఆహారం లేక తడిచిన బట్టలతో అలానే ఉండిపోయి అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు హెలికాఫ్టర్ సాయంతో వారిని రక్షించారు. ములుగు (Mulugu) జిల్లా అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లాకు చెందిన గ్రే హౌండ్స్ బలగాలు తెలంగాణ సరిహద్దులోని వాజేడు (Vajedu) మండలం ఎలిమిడి అటవీ ప్రాంతంలోకి కూంబింగ్‌కు వెళ్లాయి. మరుసటి రోజు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండగా.. బలగాలు తిరుగుముఖం పట్టాయి.
వర్షాల తీవ్రత అధికం కాగా.. గ్రే హౌండ్స్ బలగాలు అడవిలో సేఫ్ జోన్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో అడవిలోనే చిక్కుకుపోయాయి. తడిచిన బట్టలతో, ఆహారం లేక మూడు రోజులుగా అడవిలోనే ఉండడంతో అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు హెలికాఫ్టర్ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం అడవిలో చిక్కుకున్న వారిని హెలికాఫ్టర్ ద్వారా వాజేడుకు తరలించారు. అస్వస్థతకు గురైన పోలీసులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Also Read: Revanth Reddy: ప్లీజ్ రేవంత్ రెడ్డి తాతయ్య మాకు రోడ్లు వేయండి - ఇద్దరు బాలుర వీడియో వైరల్