Kiran Rao Said She is Very Happy After Divorce: విడాకుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నానంటూ బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ మాజీ భార్య, దర్శకురాలు కిరణ్ రావు (Kiran Rao) షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె 'లాపతా లేడీస్' సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన 'లాపతా లేడీస్' మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాలో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె కిరణ్ రావు ఆమిర్‌తో విడాకులు స్పందించారు. ఆమిర్‌తో విడాకులు తనపై ఎలాంటి ప్రభావం చూపలేదని, నిజానికి డైవోర్స్ తర్వాత చాలా సంతోషంగా ఉన్నానంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Kiran Rao On Divorce With Aamir Khan: ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "సంబధాలు అనేవి ఎప్పటికప్పుడు పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందని నేను భావివస్తున్నా. ఎందుకంటే మనం పెరిగే కొద్ద మనుషులుగా మారుతాం. ఆ సమయంలో మనకు అన్ని విషయాలపై అవగాహన అవసరం లేదు. ఇక నా 16 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు నేను పెద్దగా ఆలోచించలేదు. దాని నుంచి బయట పడతాను అని అనుకున్నానని. అయితే, దానికి కాస్తా టైం పట్టింది. కానీ, విడాకులు తర్వాత కూడా నేను మరింత సంతోషంగా ఉన్నా. ఈ డైవోర్స్ నాపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఆమిర్‌తో పెళ్లికి ముందు కూడా నేను ఒంటరిగానే ఉన్నాను.
నా స్వతంత్రతను నేను ఎంజాయ్ చేశాను. కానీ, అప్పుడప్పుడు ఒంటరిని అనే ఫీలింగ్ వచ్చేది. కానీ, ఇప్పుడు అలా అనిపించదు. నాతో నా కొడుకు ఆజాద్ ఉన్నాడు. ఒంటరితనమే నా దరికి చేరదు. అలాగే నాకు మా రెండు ఫ్యామిలీల(ఆమిర్ ఫ్యామిలీ, కిరణ్ రావు ఫ్యామిలీ) సపోర్టు కూడా ఉంది. అలాగే విడిపోయిన ఆమిర్‌తోనూ మంచి అనుబంధం ఉంది" అంటూ కిరణ్ రావు చెప్పుకొచ్చారు. అలాగే విడాకులు తీసుకున్న ఆమిర్ తాను ఆజాద్‌కి కో పేరెంట్స్‌గా ఉన్నామని, అలాగే తామిద్దరం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నామని చెప్పారు. ఆమిర్‌తో మంచి అనుబంధం కారణంగా తాను ఈ విడాకులు నుంచి త్వరగానే బయటపడతానని నమ్మానని, అనుకున్నట్టుగానే ఇది జరిగిందని తెలిపారు.
ఇక ఆమిర్-కిరణ్ రావుల ప్రేమ వివాహం అనే విషయం తెలిసిందే. ఆమిర్ బ్లాక్‌బస్టర్ మూవీ లాగాన్ సినిమాకు కిరణ్ రావు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అదే టైంలో ఇద్దరికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. అప్పటికే పెళ్లయిన ఆమిర్ ఫస్ట్ భార్యకు విడాకులు ఇచ్చిర కిరణ్ రావు వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు ఆజాద్ జన్మించాడు. ఇక 16 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం 2021 జూలై వీరు విడాకులు తీసుకుని భార్యభర్తలుగా విడిపోయారు. కానీ, స్నేహితులుగా వీరిద్దరు అనుబంధాన్ని పంచుకుంటున్నారు. వీరికి సంబంధించి ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా ఇద్దరు కలిసే ఉంటున్నారు.
Also Read: 'గేమ్ ఛేంజర్' రిలీజ్ ఎప్పుడో చెప్పిన నిర్మాత 'దిల్' రాజు - పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్