పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ఉన్న స్టార్ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఒకరు. మాస్ ఆడియన్స్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ రావడం వెనుక ఆ టిపికల్ కామెడీ కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. యంగ్ హీరోలకు వస్తే... టిపికల్ కామెడీ టైమింగ్ ఉన్న వారిలో సిద్ధూ జొన్నలగడ్డ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పుడు ఆయన మాస్ మహారాజాతో కలిసి తెలుగు ఆడియన్స్ ముందుకు రానున్నారు. వాళ్లిద్దరూ కలిసి నటించారట. అది ఏ సినిమా? ఆ క్యారెక్టర్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... 


'మిస్టర్ బచ్చన్'లో సిద్ధూ జొన్నలగడ్డ అతిథి పాత్ర!
Siddhu Jonnalagadda Cameo In Mr Bachchan: రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల్లో 'మిస్టర్ బచ్చన్' ఒకటి. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ అతిథి పాత్రలో సందడి చేయనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్. 'టిల్లు స్క్వేర్'తో సూపర్ సక్సెస్ అందుకున్న సిద్ధూ ఈ సినిమాలో ఎటువంటి పాత్రలో కనిపిస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.


పంద్రాగస్టుకు బాక్సాఫీస్ బరిలో గట్టి పోటీ ఉందిగా!
రవితేజ సినిమాలకు కొన్నాళ్లుగా సోలో రిలీజ్ దొరకడం గగనం అవుతోంది. ప్రతి సినిమాకూ ఏదో ఒక సినిమా పోటీ ఉంటోంది. సంక్రాంతి సినిమాల కోసం త్యాగం చేసి 'ఈగల్'ను వెనక్కి తీసుకు వచ్చినా సోలో రిలీజ్ లభించలేదు. ఇప్పుడు ఈ 'మిస్టర్ బచ్చన్'కు సైతం సోలో రిలీజ్ దొరకడం లేదు.


Also Read: బాలయ్య వీరాభిమానిగా 'బాలు గాని టాకీస్' హీరో - కొత్త సినిమా అనౌన్స్ చేసిన ఆహా






ఆగస్టు 15న 'మిస్టర్ బచ్చన్'తో పాటు ఉస్తాద్ రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్', ఇంకా చియాన్ విక్రమ్ 'తంగలాన్' సినిమాలు ఉన్నాయి. ఆ రెండూ మాస్ ఆడియన్స్, అలాగే సింగిల్ స్క్రీన్లలో పోటీ ఇస్తాయి. ఇంకా ఎన్టీఆర్ బావ మరిది నార్నె నితిన్ హీరోగా జీఏ2 పిక్చర్స్ నిర్మించిన 'ఆయ్', రానా దగ్గుబాటి సమర్పణలో నివేదా థామస్ ప్రధాన తారగా తెరకెక్కిన '35 - చిన్న కథ కాదు' సైతం ఉన్నాయి. అదీ సంగతి!


Also Readరవితేజ కొత్త సినిమా యంగ్ హీరోకి విలన్ ఛాన్స్



'షాక్', 'మిరపకాయ్' సినిమాల తర్వాత రవితేజ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న 'మిస్టర్ బచ్చన్' సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్ సంస్థలు సమర్పిస్తున్నాయి. ఇందులో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్. తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది. ఇందులో జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, ఛాయాగ్రహణం: అయనంక బోస్, నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్ర సమర్పణ: పనోరమా స్టూడియోస్ & టి సిరీస్, సంగీతం: మిక్కీ జె మేయర్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణం: టీజీ విశ్వ ప్రసాద్, రచన - దర్శకత్వం: హరీష్ శంకర్.


Also Read: 25 ఏళ్ల అమ్మాయితో 56 ఏళ్ల రవితేజ రొమాన్స్ - మిస్టర్ బచ్చన్ సాంగ్ ట్రోలర్‌కు ఇచ్చి పారేసిన హరీష్ శంకర్